Breaking News

తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న ఆలయాలు

Published on Mon, 09/08/2025 - 07:02

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్ర గ్రహణం ముగిసింది. భారత్‌లో కూడా అర్ధరాత్రి 2.25 గంటలు దాటాక పూర్తి గ్రహణం వీడింది. అనంతరం సోమవారం తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు తెరుచుకున్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకుంది. సుమారు 12 గంటల అనంతరం మహా ద్వారం తెరిచారు. గ్రహణం వీడటంతో ఆలయ శుద్ది, పుణ్యాహవచనం చేశారు అర్చకులు. అనంతరం సుప్రభాతం ప్రారంభమైంది. ఉదయం ఆరు గంటల నుంచి దర్శనం ప్రారంభమై కొనసాగుతోంది.

ఇటు, తెలంగాణలో వేములవాడ రాజన్న ఆలయం, అనుబంధ ఆలయాలు తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం కారణంగా దాదాపు 10 గంటలపాటు ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం ముగియడంతో తెల్లవారుజామున 3:45 నిమిషాలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేసిన అర్చకులు ఆలయాన్ని తెరిచారు. ఆలయ ప్రాంగణంలో స్వామి వారి చుట్టూ కోడెను తిప్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున పూజ అనంతరం ఉదయం 7 గంటల నుండి యథావిధిగా భక్తుల దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఇక, భద్రాచలంలో ఉదయం 7.30 నుంచి దర్శనాలు ప్రారంభం కానున్నాయి.

ఇదిలా ఉండగా.. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా రాత్రి 11.01 గంటల నుంచి అర్ధరాత్రి 12.23 గంటల మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. గ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పాక్షికంగా చంద్ర గ్రహణం కనిపించింది.  చంద్రుడు 82 నిమిషాలపాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు. భారత్‌లో ఆదివారం రాత్రి 9.56 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. అర్ధరాత్రి 2.25 గంటలు దాటాక పూర్తి గ్రహణం వీడింది.  

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)