Breaking News

సూరీడు సుర్రు.. మీటర్‌ గిర్రు!

Published on Fri, 04/25/2025 - 07:20

సాక్షి, హైదరాబాద్‌: భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 10 గంటలకే  సుర్రుమంటున్నాడు. ఎండలు మండిపోతుండటంతో గురువారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. కొద్ది రోజులుగా నగరంలో విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. 2024 మే 6న రికార్డు స్థాయిలో 4,352 మెగావాట్ల డిమాండ్‌ (90.68 మిలియన్‌ యూనిట్లు) నమోదు కాగా.. తాజాగా గురువారం 4,170 మెగావాట్లకు చేరింది. ఇది ఇలాగే కొనసాగితే మే ఒకటి నాటికి 4,500 మెగావాట్లకుపైగా డిమాండ్‌ వచ్చే అవకాశం లేకపోలేదని ఇంజినీర్లు  
అంచనా వేస్తున్నారు.  

ఆన్‌లోనే ఏసీలు, కూలర్లు 
గతంతో పోలిస్తే ప్రస్తుతం నగరవాసుల కొనుగోలు శక్తి పెరిగింది. రియల్‌ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఒకప్పుడు ధనవంతుల ఇళ్లలోనే కన్పించే ఏసీలు ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి నివాసాల్లోనూ అనివార్యమయ్యాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం అనేక మంది ఏసీలు, కూలర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తయారీ కంపెనీలతో పాటు వివిధ ప్రైవేటు బ్యాంకులు జీరో పర్సంటేజీ లోన్లు మంజూరు చేస్తుండటంతో ఆర్థికంగా ఉన్నవారే కాదు.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఎల్రక్టానిక్‌ యంత్రాలు సాధారణమయ్యాయి. ఫలితంగా గత కొద్ది రోజుల నుంచి నగరంలో విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)