Breaking News

చలి మొదలైంది.. పడిపోయిన ఉష్ణోగ్రతలు

Published on Mon, 11/10/2025 - 02:08

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. మోంథా తుపాను ప్రభావం పూర్తిగా తగ్గడంతో వర్షాలు ఆగిపోయాయి. ఆ తర్వాత వాతావరణంలో నెలకొన్న మార్పులు.. పొడి వాతావరణ ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అక్టోబర్‌ నెలాఖరుకల్లా ఉష్ణోగ్రతల తగ్గుదల నమోదు కావాల్సి ఉండగా, ఈసారి కాస్త ఆలస్యంగానే ఉష్ణోగ్రతల పతనం నమోదైంది. దీంతో చలి ప్రభావం కనిపిస్తోంది. రానున్న మూడు రోజులపాటు ఇదే తరహా వాతావరణం ఉంటుంది. మరోవారం తర్వాత ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని, చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

నెలాఖరుకల్లా చలి తీవ్రం  
నైరుతి రుతుపవనాలు పూర్తిగా ఉపసంహరణ కావడంతో వాతావరణంలో నెలకొనే మార్పులు శీతాకాలానికి సూచికగా కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను రాష్ట్రంలోనూ తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రస్తుతం ఆకాశం మేఘాలు లేకుండా స్పష్టంగా ఉంది. దీంతో వాతావరణం పొడిగా మారుతోంది. దీంతో రాత్రి సమయంలో భూ ఉపరితలంపైనున్న వేడి త్వరగా తగ్గుతుండడంతో ఉష్ణోగ్రతలు సైతం వేగంగా తగ్గుతున్నాయి. 

ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీ సెల్సియస్‌ తక్కువగా నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4డిగ్రీ సెల్సియస్‌ వరకు తగ్గుతున్నాయి. వేగంగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడాన్ని పరిశీలిస్తే.. నెలాఖరు నాటికి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గి చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. 

ప్రస్తుతానికి ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని అధికారులు అంటున్నారు. వాతావరణంలో నెలకొనే మార్పులతో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతల పతనం క్రమంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వివరిస్తున్నారు. 

ఆదివారం రాష్ట్రంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే... మెదక్‌లో 14.1 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా, ఆదిలాబాద్‌లో 14.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భద్రాచలం, నల్లగొండ మినహాయిస్తే... మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా నమోదైనట్టు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.   

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)