Breaking News

మూగబోయిన ఓరుగల్లు రంగస్థలం

Published on Mon, 05/26/2025 - 10:56

హన్మకొండ కల్చరల్‌: ఓరుగల్లు ముద్దుబిడ్డ,  ప్రముఖ రంగ స్థల కళాకారుడు జీవీబాబు (70)  ఇకలేరు. బలగంతోపాటు 20 సినిమాలకు పైగా నటించిన మహా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. రెండు కిడ్నీలు పాడై కొంత కాలంగా డయాలసిస్‌తో బాధపడుతున్నారు. వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో వరంగల్‌ రామన్నపేట( పాపయ్యపేట)లో విషాదఛాయలు అలుముకున్నాయి. 

నాటక ప్రదర్శనలతో చైతన్యం..
సినిమాలకు అంతగా ప్రాధాన్యం లేని సమయంలో బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, కన్యాశుల్కం వంటి సాంఘిక, సామాజిక సమస్యలను ఎత్తి చూపి వాటిని పారద్రోలేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం అనేక నాటకాలు  రచించి నాటకాలు వేసి అగ్ర స్థానంలో నిలిపారు. పౌరాణిక నాటకాలు వేసి ప్రేక్షకులను మెప్పిస్తూ ఆటపాటతో ఉర్రూతలు ఊగించారు.  

జీవీబాబు భౌతికకాయానికి నివాళి..
జీవిబాబు మృతిపై బలగం డైరెక్టర్‌ యొల్దండి వేణుతోపాటు హీరో ప్రియదర్శి విచార వ్యక్తం చేశారు. రామన్నపేటలోని తన నివాసంలో జీవీబాబు భౌతికకాయాన్ని ఉంచగా..  నాటక సమఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం, రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక బా«ధ్యులు కాజీపేట తిరుమలయ్య, ఎన్‌ఎస్‌ఆర్‌ మూర్తి, బలగం డైరెక్టర్‌ వేణు, హీరో ప్రియదర్శి, చిత్రం సభ్యులు బాలు కాయితి, ఆకునూరి దేవయ్య, బలగం కొమురమ్మ, భాస్కర్, నటుడు సుధాకర్, ఇతర నటీమణులు, రంగ స్థల కళాకారులు సందర్శించి నివాళులరి్పంచారు.

నటనలో ఆయనకు సాటేరి.. 
వరంగల్‌ రామన్నపేట(పాపయ్యపేట)కు చెందిన జీవిబాబు బలగం సినిమాలో హీరో ప్రియదర్శి తాతగా.. కొమురయ్య తమ్ముడిగా అంజన్న పాత్రలో నటించాడు. జీవీ బాబు అసలు పేరు గుడిబోయిన బాబు. సుజాతతో వివాహమైంది. రంగస్థల వేదికపై  50పైగా నాటకాలు వేసి ప్రేక్షకులను మెపించారు. 20కి పైగా సినిమాలలో నటించారు. పౌరాణిక నాటక రంతోపాటు సినిమా రంగంలో వరంగల్‌కే మూల స్తంభంగా నిలిచారు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు