Breaking News

Transgender Woman: ట్రాన్స్‌జెండర్లపై మనసుపడి.. మనువాడి!

Published on Tue, 02/14/2023 - 03:04

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న వారిలో ట్రాన్స్‌జెండర్ల వర్గమొకటి. ఈ వర్గంవారు ఎక్కువగా భిక్షాటన, ఇతర వృత్తుల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వా­రిపై ఆదరణ చూపేవారికన్నా చీదరించుకునే వారే అధికంగా ఉంటారు. ఇలాంటివారికి పెళ్లి భాగ్యం తక్కువే.

సాధారణంగా ఇలాంటి వారిని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారు. కానీ ఇటీవల ట్రాన్స్‌జెండర్లను సైతం కొందరు యువకులు ప్రేమించిపెళ్లి చేసుకుంటున్నారు. కన్నవారిని, స­మాజ కట్టుబాట్లను సైతం ఎదురిస్తూ ఇష్టపడిన వా­రిని మనువాడుతున్నారు. ప్రేమ అంటే పైకి కనిపించే శరీరం కాదని.. అది మనసుకు సంబంధించిన విషయమని అంటున్నాయి ఈ రకపుప్రేమ జంటలు.  

మూడేళ్లపాటు ప్రేమించి..  
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం అనంతతోగుకు చెందిన ట్రాన్స్‌జెండర్‌ అఖిల, భూపాలపల్లికి చెందిన రూపేశ్‌ మూడేళ్లపాటు ప్రేమించుకున్నారు. అయితే తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో వారిని ఎదురించి గత మార్చిలో ఇల్లెందులో హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. ప్రస్తుతం వారిద్దరూ కలసి ఉంటున్నారు. తమకు ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నారు. 

ఒకరినొకరు ఇష్టపడి.. 
కరీంనగర్‌ జిల్లా వీణవంకకు చెందిన ట్రాన్స్‌జెండర్‌ దివ్యను జగిత్యాలకు చెందిన అర్షద్‌ పెళ్లిచేసుకున్నారు. మొదట కొంతకాలం ఇద్దరూ కలిసే ఉన్నారు. ప్రేమలో ఉండి సహజీవనం చేశారు. చివరకు అర్షద్‌ తన ఇంట్లో వాళ్లను ఎదిరించి గతేడాది డిసెంబర్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం దివ్యను వివాహం చేసుకున్నారు. తమకు ప్రభుత్వం ఏదైనా ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. 

జాతరలో పరిచయమై.. 
2019లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్‌ను ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నాడు. మేడారం జాతరలో చిగురించిన వీరి ప్రేమ చివరకు పెళ్లికి దారి తీసింది. గతంలో కుటుంబాల్లో కట్టుబాట్లకారణంగా ఎక్కువగా బయటకురాని ఈ తరహా జంటలు.. ఇప్పుడు స్వేచ్ఛా సమాజం కారణంగా తమ విషయాలను ధైర్యంగా చెప్పగలుగుతున్నారు.  

చట్టబద్ధత కోసం పోరాటం 
దేశంలో తొలిసారిగా కేరళలో ఓ ఎల్‌జీబీటీ పెళ్లి జరిగింది. ఆ దంపతులు తమ పెళ్లిని రిజిస్టర్‌ చేసి చట్టబద్ధత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ట్రాన్స్‌జెండర్ల పెళ్లిళ్లపై చర్చ మొదలైంది. ఎల్‌జీబీటీ హక్కుల చట్టంలో పెళ్లితో సహా, మరికొన్ని అంశాలు చేర్చాలనే పిటిషన్లు సుప్రీంలో విచారణలో ఉన్నాయి. తమకు అన్ని హక్కులు కల్పించాలని ట్రాన్స్‌జెండర్ల డిమాండ్‌. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)