Breaking News

ఈ దొంగకు న్యూ ఇయర్‌ ఒకరోజు ముందే వచ్చింది.. ఏం చేశాడో తెలుసా?

Published on Tue, 12/31/2024 - 16:29

సాక్షి,మెదక్‌ : అతడో దొంగ. అసలే కొత్త సంవత్సరం (new year). సెలబ్రేట్‌ చేసుకుందామని అనుకున్నాడు. డబ్బులు కావాలి కదా. వైన్‌ షాపులో డబ్బులు బాగా ఉంటాయ్‌. దోచేద్దామని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా రెండ్రోజుల పాటు రెక్కీ కాచాడు. మూడో రోజు ప్లాన్‌ ప్రకారం.. తాను ముందుగా రెక్కి నిర్వహించిన వైన్‌ షాప్‌లో దొంగతనం చేశాడు. 

దొంగతనానికి ముందే తాను ఎవరికి దొరక్కూడదనే ఉద్దేశ్యంతో సీసీ టీవీ కెమెరాల్ని ధ్వంసం చేశాడు. గల్లా పెట్టెలో ఉన్న డబ్బుంతా ఊడ్చేశాడు. అనంతరం బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్లుగా చేశాడు. కానీ చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టడంతో పోలీసులకు అడ్డంగా దొరికి పోయాడు.

మెదక్‌ జిల్లా నార్సింగ్‌ ప్రాంతంలో నిర్వాహకులు కనకదుర్గా వైన్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి 10 వైన్‌ షాపును క్లోజ్‌ చేసి ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆ వైన్‌ షాప్‌లో దొంగతనం ప్లాన్‌ చేసిన దొంగ రూఫ్‌ను తొలగించి షాప్‌లో చొరబడ్డాడు. డబ్బుల్ని కాజేశాడు. అనంతరం, దొంగతనానికి వచ్చిన ఆ దొంగకి మందు మీద కుతిపుట్టింది. వెంటనే వైన్‌ షాపులో ఏ బ్రాండ్‌ దొరికితే.. ఆ బ్రాండ్‌ని ఫుల్లుగా సేవించాడు. మత్తులో తాను దొంగతనానికి వచ్చానన్న విషయాన్ని మర్చిపోయి ఎంచక్కా పడుకున్నాడు.  

ఆ మరుసుటి రోజు అంటే నిన్న ఉదయం నిర్వహాకులు వైన్‌ షాప్‌ను ఓపెన్‌ చేశారు. దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఆ పక్కనే మత్తులో ఉన్న దొంగను గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగను పరిశీలించి అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మోతాదుకు మించి మద్యం సేవించడం వల్ల స్పృహ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. స్పృహలోకి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభిస్తామని వెల్లడించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)