Breaking News

సమస్యలు పరిష్కరించకుంటే సమరమే 

Published on Mon, 07/10/2023 - 03:16

 సాక్షి, హైదరాబాద్‌: తమ సమస్యలను పరిష్కరించకుంటే సమరం చేయాల్సి ఉంటుందని తెలంగాణ బోధనా వైద్యుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఆ సంఘం సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ అన్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జలగం తిరుపతిరావు, ఉపాధ్యక్షులు డాక్టర్‌ కిరణ్‌ మాదల, డాక్టర్‌ ప్రతిభాలక్ష్మి, కోశాధికారి డాక్టర్‌ కిరణ్‌ ప్రకాష్, ప్రాంతీయ కార్యదర్శి డాక్టర్‌ ఎల్‌.రమేష్‌ ఈ మేరకు ప్రకటించారు.

రాష్ట్రంలోని మొత్తం 25 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు సహా అదనపు డీఎంఈ స్థాయి వరకు బోధనా వైద్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రతీ నెలా జరుగుతున్న సమీక్ష సమావేశంలో కేవలం లక్ష్యాలు ఇవ్వటమే కాక, వైద్యుల సమస్యల గురించి కూడా చర్చ జరగాలని వారు డిమాండ్‌ చేశారు.

సమస్యల విషయంలో గత ఏడాది నిరసన తెలిపినప్పుడు మంత్రి హరీశ్‌ రావు భరోసాతో వెనక్కి తగ్గినప్పటికీ, అందులో అనేక సమస్యలు అలాగే పరిష్కారం కాకుండా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను మరోసారి ప్రభుత్వానికి తెలియజేస్తామని, అప్పటినుంచి నిర్ణీత వారం రోజుల సమయంలో స్పందించకపోతే, ‘చలో హైదరాబాద్‌‘ అనే నినాదంతో పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)