కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్
Breaking News
4 రోజుల పాటు హైదరాబాద్‌లో తరుణ్ ఛుగ్ మకాం
Published on Sat, 09/03/2022 - 03:28
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ శనివారం నుంచి 4 రోజుల పాటు హైదరాబాద్‌లో మకాం వేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఖరారుతో పాటు పార్టీపరంగా చేపడుతున్న కార్యక్ర మాలు, సాధిస్తున్న ఫలితాలపై శనివారం నుంచి వరుసగా ఆయన ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశాలను నిర్వహించనున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన ‘ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ’ని ప్రకటిస్తారు.
ఈ కమిటీ కింద పనిచేసే సమన్వయ కమిటీకి జాతీయ కార్యవర్గసభ్యుడు జి.వివేక్‌ను చైర్మన్‌గా, గంగిడి మనో హర్‌రెడ్డిని కన్వీనర్‌గా నియమించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనితో పాటు మొత్తం 22 కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఇంతవరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు విడతల పాదయాత్ర, ఒక విడత బైక్‌ర్యాలీ, ఇతర కార్యక్రమాలను తరుణ్ ఛుగ్ సమీక్షిస్తారు.
Tags : 1