Breaking News

కడియం, దానంకు స్పీకర్‌ మళ్లీ నోటీసులు

Published on Thu, 11/20/2025 - 13:14

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు స్పీకర్‌ మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా అనర్హత పిటిషన్లపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పీకర్‌ స్పష్టం చేశారు. అయితే, గతంలో ఇచ్చిన నోటీసుకు ఆయన సమాధానం ఇవ్వడానికి సమయం కావాలని కోరడంతో దానం నాగేందర్ మరో నోటీసును స్పీకర్ నుంచి అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మూడు నెలల్లో (అక్టోబర్ 31, 2025 నాటికి) విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆ అనర్హత పిటిషన్లపై విచారణను ఇప్పటికే ప్రారంభించారు. అయితే, విచారణను మరింత ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ విపక్ష బీఆర్ఎస్ నవంబర్ 17న సుప్రీంకోర్టులో స్పీకర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. దీంతో, ఈ వ్యవహారంలో స్పీకర్‌ వేగం పెంచారు. మరోవైపు, పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇప్పటివరకు ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. 
 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)