Breaking News

పెండింగ్‌ బిల్లులు చెల్లించామనడం అవాస్తవం

Published on Mon, 11/25/2024 - 04:41

సాక్షి, హైదరాబాద్‌: గ్రామాల్లో గతంలో సర్పంచ్‌లు చేసిన అభి వృద్ధి పనులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయనప్పటికీ రూ.750 కోట్ల పెండింగ్‌ బిల్లులను చెల్లించేశామని ప్రభు త్వం పేర్కొనడం అవాస్తవమని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆరోపించింది. పెండింగ్‌ బిల్లులు చెల్లించామని అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థాయికి తగదని సంఘం నేతలు పేర్కొన్నారు. 

ఈ మేరకు సర్పంచుల సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డిలు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘2024 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌ (ఎస్‌డీఎఫ్‌) నిధులు, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎఫ్‌సీ) నిధులు ఇవ్వలేదు. జనరల్‌ నిధులపైనా ఫ్రీజింగ్‌ ఇంకా ఎత్తివేయలేదు. ఇప్పటికీ గత సర్పంచుల చెక్కులు ట్రెజరీలోనే ఉన్నాయి’అని వారు పేర్కొన్నారు. 

ఆందోళనకు దిగుతాం.. 
రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడుస్తున్నా.. సర్పంచ్‌లపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని సర్పంచుల సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆరోపించింది. డిసెంబర్‌ 1వ తేదీ వరకు పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోతే తెలంగాణ మొత్తం 12,769 సర్పంచ్‌ల కుటుంబ సభ్యులతోపాటు ప్రజలను కూడగట్టుకొని ఆందోళనకు దిగుతామని స్పష్టం చేసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)