Breaking News

గ్లోబల్‌ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

Published on Sat, 11/29/2025 - 02:50

సాక్షి, హైదరాబాద్‌: డిసెంబర్‌ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు ప్రభుత్వం భారీయెత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సు కోసం దేశ, విదేశాలకు చెందిన 3 వేల మంది ప్రముఖులను ఆహ్వానించాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర చరిత్రలోనే ప్రతిష్టాత్మ కంగా సదస్సు నిర్వహణ ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. అంతర్జాతీయంగా పేరున్న పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ రంగ ప్రముఖులు ఈ సదస్సుకు రానున్నారు. 

బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రాయల్‌ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు హాజరు కానున్నారు. యూఏఈ రాజవంశానికి చెందిన షేక్‌ తారిక్‌ అల్‌ ఖాసిమీ, రస్‌ అల్‌ ఖైమా, డ్యూచ్‌ సె గ్రూప్‌ హెడ్‌ లుడ్విగ్‌ హెయిన్జెల్మాన్, ఎన్రిషన్‌ వ్యవస్థాపక భాగస్వామి డబ్ల్యూ విన్‌స్టన్, మాండల్‌ వైల్డ్‌ లైఫ్‌ గ్రూప్‌ సీఈఓ బెనెట్‌ నియోతో పాటు పలు టెక్‌ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్‌ల వ్యవస్థాప కులు రానున్నారు. ఇక వివిధ రంగాల ప్రముఖులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరిట స్వయంగా ఆహ్వానాలు పంపిస్తున్నారు. 

తప్పకుండా రండి..
‘వికసిత్‌ భారత్‌ 2047 జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా మా ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ డాక్యు మెంట్‌ను తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, అన్ని వర్గాల సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు తెలంగాణకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. మా ప్రభుత్వ సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్‌ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2025ను నిర్వహిస్తు న్నాం, తప్పకుండా రండి..’ అనే ప్రభుత్వ ఆహ్వానానికి పలు దేశాల ప్రతినిధులు సమ్మతి తెలిపారని సీఎంవో వర్గాలు తెలిపాయి.

రెండు రోజుల పాటు జరిగే సదస్సులో భాగంగా డిసెంబర్‌ 9న తెలంగాణ రైజింగ్‌ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం లయోనల్‌ మెస్సీ ఈ నెల 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలువనుందని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)