Breaking News

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వర్ష బీభత్సం.. ఆరుగురి మృతి

Published on Thu, 07/27/2023 - 20:45

సాక్షి, వరంగల్‌: తెలంగాణలో కురుస్తున్న కుండపోత  వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి సైతం వరదనీరు పోటెత్తడంతో నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు, కాలనీలు, ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరిపోవడంతో ప్రజలు దిక్కుతోచని అయోమయ పరిస్థితులలో జీవిస్తున్నారు. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరదల ప్రభావం మరీ దారుణంగా ఉంది. వర్షం, వరదలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరుగురు మృతి చెందగా.. 12 మంది గల్లంతయ్యారు. భూపాలపల్లి జిల్లాలో మోరంచ వాగులో సంజీవ్ అనే వ్యక్తి వరదలో కొట్టుకుపోయి మృతి చెందగా.. మరో నలుగురు గల్లంతయ్యారు. ములుగు జిల్లా మారేడుగొండ చెరువు కట్ట తెగి ఇల్లు కొట్టుకుపోయింది. ఈ క్రమంలో ఇంట్లో నివాసముండే సారయ్యతో పాటు ముగ్గురు గల్లంతయ్యారు. సారయ్య మృతదేహం లభ్యం. సారమ్మ, రాజమ్మ కోసం గాలిస్తున్నారు.
చదవండి: Telangana Rains: మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏటూరు నాగారం మండలం కొండాయి వద్ద జంపన్న వాగులో ఆరుగురు గల్లంతయ్యారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి వద్ద అన్నదమ్ములు శ్రీనివాస్, యాకయ్య కొట్టుకుపోయి మృతిచెందారు. హనుమకొండలో ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతిచెందారు. వేలేరు మండలం కన్నారం వద్ద  వరద దాటుతూ బైకిస్టు మహేందర్ బైక్‌తో సహా కొట్టుకుపోయి మృతి చెందారు. 

కాగా చిట్యాల మండలం నైన్ పాక వద్ద వరదల్లో చిక్కుకున్న కాంట్రాక్టు వర్క్ చేసే ఆరుగురిని ఆర్మీ హెలికాప్టర్ కాపాడింది. కాటారం మండలం గంగారం వద్ద మానేరు వాగులో చిక్కుకున్న 4 గురు రైతులను డ్రోన్ కెమెరాతో సెర్చ్ చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడింది.
చదవండి: తెలంగాణ చరిత్రలోనే రికార్డు వర్షపాతం.. నీట మునిగిన మేడారం

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)