Breaking News

సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితాల ప్రచురణ

Published on Wed, 08/27/2025 - 02:12

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి...రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సన్నాహాలు వేగవంతం చేసింది. ఎన్నికలకు సన్నద్ధం కావడంలో భాగంగా పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను (డీపీవో) ఆదేశిస్తూ మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఐ.రాణీకుముదిని నోటిఫికేషన్‌ జారీచేశారు.

2025 జూలై 1న అందుబాటులోకి వచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాల ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలను తు.చ. తప్పకుండా అనుసరిస్తూ వార్డుల విభజన చేస్తూ తామిచ్చిన షెడ్యూల్‌ను అనుసరించాలని స్పష్టం చేశారు. డీపీవోలతో పాటు అదనపు జిల్లా ఎన్నికల అధికారులు, ఎంపీడీవోలు, సహాయ జిల్లా ఎన్నికల అధికారులు, సీఈవోలు, అదనపు జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు (హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలు మినహా), పీఆర్‌ ఆర్‌డీ డైరెక్టర్, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శికి దీని ప్రతులను పంపించారు.

ఎస్‌ఈసీ జారీచేసిన షెడ్యూల్‌...
గురువారం (ఆగస్ట్‌ 28న) గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాను రూపొందించి గ్రామపంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో ప్రదర్శించాలి. 
శుక్రవారం (29న) జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారుల (జిల్లా కలెక్టర్లు) సమావేశం 
 శనివారం (30న) మండల స్థాయిలో సంబంధిత ఎంపీడీవోల ఆధ్వర్యంలో రాజకీయ పారీ్టల ప్రతినిధుల సమావేశం 

గురువారం నుంచి శనివారం దాకా (28 నుంచి 30వ తేదీ వరకు) గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల రీఅరేంజ్‌మెంట్‌కు (వార్డుల వారీగా గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా) సంబంధించి అభ్యంతరాల స్వీకరణ 
ఆదివారం (31న) ఈ అభ్యంతరాలపై డీపీవోల ద్వారా పరిష్కారం 
సెప్టెంబర్ 2న గ్రామపంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాలను డీపీవోల ద్వారా ప్రచురణ. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)