Breaking News

పోలీస్‌ వెబ్‌సైట్‌.. అప్‌డేట్‌ మిస్‌

Published on Mon, 03/09/2026 - 08:04

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పోలీసు...ఈ పేరు చెప్పగానే టెక్నాలజీ గుర్తుకువస్తుంది. దీని వినియోగానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న రాష్ట్రం అనేక ప్రాంతాలకు మార్గదర్శకమైంది. కేసు నమోదు నుంచి దర్యాప్తు, అభియోగపత్రాల దాఖలు వరకు ఆన్‌లైన్‌ విధానం కొనసాగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా... ప్రాథమిక అంశమైన అధికారిక వెబ్‌సైట్‌ నిర్వహణలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. పునర్వ్యవస్థీకరణను పట్టించుకోకుండా, అధికారుల బదిలీలపై దృష్టి పెట్టకుండా, అదనపు బాధ్యతలు తప్పినా ఇన్‌చార్జ్‌లను కొనసాగిస్తూ దీని నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాజధానిలోని కమిషనరేట్లలో జరిగిన మార్పుచేర్పులను  పట్టించుకోవట్లేదు. కొన్ని బదిలీ, బాధ్యతల స్వీకరణ జరిగి ఇప్పటికి నెలన్నర అవుతున్నా అధికారిక వెబ్‌సైట్‌ (tspolice.gov.in)లో మాత్రం మార్పుచేర్పులు లేవు. ఇలాంటి చిత్రాలు మరెన్నో రాష్ట్ర పోలీసు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

  • వాటిలో కొన్ని ఇవి... 
     జనవరి 17న జరిగిన ఐపీఎస్‌ బదిలీల్లో భాగంగా ఐపీఎస్‌ అధికారి ఎస్‌.చైతన్యకుమార్‌ నగర డిటెక్టివ్‌ డిపార్ట్‌మెంట్‌ డీసీపీగా వచ్చారు. అంత వరకు ఈ పోస్టుకు అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అంతర్థానమైపోయిన సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ను కొనసాగిస్తున్న పోలీసు వెబ్‌సైట్‌ దీనికి చైతన్యకుమార్‌ డీసీపీగా ఉన్నట్లు చూపిస్తోంది.  

  • నగర పోలీసు విభాగంలో పరిపాలన డీసీపీగా కె.వెంకట లక్ష్మి నియమితులయ్యారు. అయినా ఇప్పటికీ తఫ్ఫీర్‌ ఇక్బాల్‌ను వెబ్‌సైట్‌ ఇన్‌చార్జ్‌గా కొనసాగిస్తోంది. ఈయన నగరంలో సౌత్‌ రేంజ్‌ అదనపు సీపీగా నియమితులైనా... ఇంకా సంయుక్త సీపీ శాంతిభద్రతలుగానే చూపిస్తోంది.  

  • గతంలో నగర నిఘా విభాగమైన స్పెషల్‌ బ్రాంచ్‌కు డీసీపీగా పని చేసిన అపూర్వ రావు కొన్నాళ్ల ఇంటెలిజెన్స్‌కు బదిలీ అయ్యారు. అధికారిక వెబ్‌సైట్‌ మాత్రం ఈ విషయం పట్టించుకోలేదు.   

  • రాజధానిలోని పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత రాజేంద్రనగర్, శంషాబాద్‌ జోన్లు హైదరాబాద్‌లో కలిశాయి. అలాగే నగరంలో ఉన్న జోన్ల పేర్లు ఈస్ట్, వెస్ట్, సెంట్రల్‌... నుంచి సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌... ఇలా మారాయి. ఈ అంశమూ వెబ్‌సైట్‌ నిర్వాహకులకు పూర్తిగా పట్టలేదు. రక్షితా మూర్తిని సికింద్రాబాద్‌ డీసీపీ అంటూ అప్‌డేట్‌ వెర్షన్‌ నమోదు చేసినా.. కె.శిల్పవల్లిని మాత్రం ఇప్పటికీ సెంట్రల్‌ జోన్‌ డీసీపీగానే వెబ్‌సైట్‌ సంబోధిస్తోంది. రాజేంద్రనగర్‌ను సైబరాబాద్‌తో చూపిస్తున్న సైట్‌... అక్కడ ఉన్న డీసీపీ శ్రీనివాస్‌కు బదులు యోగేష్‌ గౌతం అంటూ కొనసాగిస్తోంది.    

  • రాచకొండ కమిషనరేట్‌ పేరు మల్కాజ్‌గిరిగా మారింది. అవినాష్‌ మహంతిని దీనికి కమిషనర్‌గా చూపిస్తున్న వెబ్‌సైట్‌... మహేశ్వరం జోన్‌ను మాత్రం రాచకొండగానే కొనసాగిస్తోంది. మరికొందరు డీసీపీ పోస్టులూ రాచకొండలో ఉన్నట్లే పేర్కొంటోంది. నగర సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ డీసీపీగా కె.శ్యామ్‌ సుందర్‌ వచి్చనా... ఇప్పటికీ అపూర్వ రావే ఇన్‌చార్జ్‌ అని వెబ్‌సైట్‌ చెప్తోంది. 

  • హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ డీసీపీగా పని చేసిన చింతమనేని శ్రీనివాస్‌ చాలా రోజుల క్రితమే సైబరాబాద్‌లో కొత్తగా ఏర్పడిన శేరిలింగంపల్లి డీసీపీగా వెళ్లారు. విభజన తర్వాత జూబ్లీహిల్స్‌గా మారిన ఈ జోన్‌కు రమణారెడ్డి డీసీపీగా వచ్చారు. ఈ అంశాలు వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ కాలేదు.  

  • పాతబస్తీలోని సౌత్‌ జోన్‌ చారి్మనార్‌ జోన్‌గా మారిపోయింది. అయితే పోలీసు వెబ్‌సైట్‌లో మాత్రం ఇంకా పాత పేరే కొనసాగుతోంది.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)