Breaking News

గాల్లోకి డబ్బులు.. యూట్యూబర్‌ హర్షను అరెస్ట్‌ చేసిన పోలీసులు

Published on Fri, 08/23/2024 - 17:41

సాక్షి, హైదరాబాద్‌: పబ్లిక్‌లో రీల్స్‌ చేయడంపై తెలంగాణ పోలీసుల వార్నింగ్‌ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో వీడియోల కోసం పబ్లిక్‌ను ఇబ్బంది పెట్టొదని తెలిపారు. రీల్స్‌ కోసం సమాజానికి ఇబ్బంది కలిగేలా.. పిచ్చి చేష్టలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరించారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేసిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

కూకట్‌పల్లిలో ట్రాఫిక్‌ మధ్యలో డబ్బులు గాల్లోకి చల్లి వాహనదారులకు ఇబ్బంది కలిగించిన యూట్యూబర్‌ హర్ష అలియాస్ మహాదేవ్‌ను కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్‌ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు పెట్టారు.

‘తమ కెరీర్‌ లక్ష్యాలపై దృష్టిసారించాల్సిన యువత దారి తప్పుతుంది. సమాజానికి ప్రమాదకరంగా మారి, వారి కుటుంబాలను కూడా ప్రమాదంలోకి నెడుతుంది. ఇలాంటి దుశ్చర్యలపై పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోరు. కఠిన చట్టాలు ప్రయోగించి జైలు ఊచల వెనక బందీ చేస్తారు తస్మాత్‌ జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు.

కాగా గురువారం కూకట్‌పల్లి యూట్యూబర్‌ పవర్ హర్ష అలియాస్ మహదేవ్‌ హల్చల్‌ చేశాడు. ట్రాఫిక్ మధ్యలో డబ్బును గాల్లోకి విసిరాడు. దీంతో డబ్బులను పట్టుకోవడానికి ప్రజలు పరుగులు పెట్టారు. ఇంతకముందు కూడా చాలాసార్లు ట్రాఫిక్‌లో డబ్బులు గాల్లోకి చల్లుతూ రీల్స్ పోస్ట్ చేశారు. కరెన్సీ నోట్ల కట్టలను గాల్లోకి చల్లుతూ బైక్‌పై స్టాంట్లు కూడా చేశాడు. వీటిని సోషల్‌ ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లో పోస్టు చేస్తుంటాడు. హర్ష వ్యవహారంపై వాహనదారులు మండిపడుతున్నారు.

 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)