Breaking News

కోడి పందేల నిర్వహణ.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీకి నోటీసులు

Published on Thu, 02/13/2025 - 12:15

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌కి బిగ్ షాక్ తగిలింది. ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణకు సంబంధించి మొయినాబాద్‌ పోలీసులు ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో నాలుగు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

హైదరాబాద్‌ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్‌ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణ తీవ్ర కలకలం రేపింది. కోడి పందాలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్‌-3 అండ్‌ గేమింగ్‌ యాక్ట్‌, సెక్షన్‌-11 యానిమల్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, ఫామ్‌హౌస్‌ను శివ కుమార్‌ వర్మ లీజ్‌కు తీసుకున్నట్టు తెలుస్తోంది.  

ఇదిలా ఉండమొయినాబాద్‌ తోల్కట్టలోని ఫామ్‌హౌస్‌పై దాడిలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించేశారు. యూపీఐ ట్రాన్సక్షన్ల కోసం ఆర్గనైజర్లు స్కానర్లు వినియోగించినట్లు పోలీసులు తేల్చారు. యూపీఐ ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)