జన్వాడ రేవ్‌ పార్టీ సంచలనం.. అర్ధరాత్రి పోలీసులకు చుక్కలు?

Published on Sun, 10/27/2024 - 13:14

సాక్షి, హైదరాబాద్‌: జన్వాడ ఫామ్‌ హౌస్‌లో రేవ్‌ పార్టీ తెలంగాణలో రాజకీయంగా సంచలనంగా మారింది. రేవ్‌ పార్టీలో కేటీఆర్‌ బావ మరిది ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు.. రేవ్‌ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏ1గా కార్తిక్‌, ఏ2గా రాజ్‌ పాకాలను చేర్చారు.  

జన్వాడ ఫామ్‌ హౌస్‌ రేవ్‌ పార్టీ తతంగంపై ఎక్సైజ్‌ పోలీసులు కూడా రంగం దిగారు. తాజాగా ఫామ్‌ హౌస్‌ మేనేజర్లు కార్తిక్‌, రాజేంద్ర ప్రసాద్‌ ఎక్సైజ్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈవెంట్‌కి అనుమతి లేదని చెప్పారు. అలాగే, రేవ్‌ పార్టీ కోసం మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన అనుమతి లేని మద్యం తీసుకువచ్చినట్టు వెల్లడించారు. ఫామ్‌ హౌస్‌లో డ్యూటీ ఫ్రీ మద్యం లభ్యమైనట్టు చెప్పారు. దీంతో, ఎక్సైజ్​ యాక్ట్​ సెక్షన్ 34 కింద కేసును నమోదు చేశారు. అలాగే, ఈ పార్టీలో విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా.. రేవ్‌ పార్టీలో మొత్తం 35 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. పాల్గొన్న వారిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవ్‌ పార్టీలో విజయ్​ మద్దూరి అనే వ్యక్తి కొకైన్​ తీసుకున్నట్లు పోలీసుల పరీక్షల్లో నిర్ధారణ అయింది. కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో ఎన్​డీపీఎస్​ యాక్ట్​ కింద కేసు నమోదు చేశారు. ఇక, మహిళలకు టెస్టులు చేసే సమయంలో పోలీసులకు వారికి సహాకరించలేదని సమాచారం. పోలీసులకు చుక్కలు చూపించినట్టు తెలిసింది. విజయ్​ మద్దూరి కూడా పోలీసులను బెదిరించినట్టు సమాచారం. 

అలాగే, రేవ్‌ పార్టీలో క్యాసినో పరికరాలు సైతం స్వాధీనం చేసుకోవడంతో క్యాసినో నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్‌ హౌస్‌లో ప్లేయింగ్​ కార్డ్స్​, ప్లాస్టిక్​ కైన్స్​ వంటివి కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా, 30 ఎకరాల్లో రాజ్​ పాకాల ఫామ్‌హౌస్‌​ విస్తరించి ఉంది. రేవ్‌ పార్టీ, అక్రమంగా ఫామ్‌ హౌస్‌ నిర్మించారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సీజ్‌ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)