Breaking News

బెటాలియన్‌ కానిస్టేబుళ్ల ఆందోళనపై పోలీసు శాఖ సీరియస్‌

Published on Sat, 10/26/2024 - 15:48

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పోలీస్‌ బెటాలియన్‌లలో పనిచేసే కానిస్టేబుళ్ల ఆందోళనలపై రాష్ట్ర పోలీస్‌ శాఖ సీరియస్‌ అయ్యింది. విధులు బహిష్కరించి రోడ్లపైకి వచ్చి పోలీసులు ఆందోళన చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా భావిస్తున్నట్లు డీజీపీ జితేందర్‌ తెలిపారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించమని హెచ్చరించారు. 

పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ సామాన్య జనానికి ఇబ్బంది కలిగేలా రోడ్లపై వచ్చిన పోలీసులపై చట్టపరమైన, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సెలవుల విషయంలో  పాత పద్ధతినే అనుసరిస్తామని ఇప్పటికే చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళన చేయడంపై సరికాదన్నారు.  ఆగ్రహం వ్యక్తం చేసింది. బెటాలియన్స్‌లో ఆందోళన చేస్తున్న వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానిస్టేబుళ్ల ఆందోళన వెనక ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తముందని అనుమానం ఉందన్నారు.

కాగా తెలంగాణలో  ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ  రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్‌ పోలీసులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అన్ని జిల్లాలోలనూ కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు

వరంగల్ జిల్లా మమూనూరు క్యాంపులో మొదలైన ఆందోళన సెక్రటేరియట్ చేరింది. క్రమంగా రాష్ట్రంలోని అన్ని బెటాలియన్లకు పాకింది.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, నల్గొండ రూరల్‌, మంచిర్యాలలో నిరసనలు చేపట్టారు.      అయితే  మామునూరు బెటాలియన్ ఆవరణలో ఏకంగా యూనిఫాం ధరించిన పోలీసులే నిరసనకు దిగారు. టీజీఎస్పీ వద్దు ఏక్ పోలీస్ ముద్దు, టీజీఎస్పీకో హఠావో.. ఏక్ పోలీస్ బనావో అంటూ నినాదాలు చేశారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)