Breaking News

చార్మినార్‌ టు ఫ్యూచర్‌ సిటీ!

Published on Thu, 01/23/2025 - 04:52

సాక్షి, హైదరాబాద్‌: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ‘తెలంగాణ మీన్స్‌ బిజినెస్‌’(తెలంగాణ అంటేనే వాణిజ్యం) అనే థీమ్‌తో ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను హైదరాబాద్‌ ప్రత్యేకతలు చాటేలా తీర్చిదిద్దారు. గతంలో వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు చోట్ల పెవిలియన్‌ కేటాయించగా ఈసారి ఇండియన్‌ గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలు తమ పెవిలియన్లు ఏర్పాటు చేశాయి. 

హైదరాబాద్‌ నగర చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టేలా పెవిలియన్‌ను రూపొందించారు. చార్మినార్‌తోపాటు సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్, హైటెక్‌ సిటీ వంటి చిహ్నాలతో రూపొందించిన పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు. దేశంలోనే ఉన్నత జీవన ప్రమాణాలతో అత్యంత నివాస యోగ్యంగా హైదరాబాద్‌కు అనుబంధంగా 14 వేల ఎకరాల్లో నిర్మించే ఫ్యూచర్‌ సిటీ ప్రణాళికలను వివరించేలా పెవిలియన్‌ను తీర్చిదిద్దారు.

ఫ్యూచర్‌ సిటీలో 6వేల ఎకరాల్లో పర్యావరణ జోన్‌తోపాటు ‘వర్క్, లివ్, లెర్న్, ప్లే’కాన్సెప్ట్‌తో ఉండే ఫ్యూచర్‌ సిటీ నమూనా ప్రదర్శిస్తున్నారు. మెట్రో, అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌ రింగు రోడ్డుతోపాటు మెట్రో విస్తరణ, రీజినల్‌ రింగు రోడ్డు తదితరాలను ప్రస్తావించారు. వీటితోపాటు నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ, ప్రముఖ విద్యా సంస్థలు ఐఎస్‌బీ, ట్రిపుల్‌ ఐటీ, నల్సార్‌ ప్రత్యేకతలను చాటేలా పోస్టర్లు రూపొందించారు.   

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)