సాగు వృద్ధిలో రాష్ట్రం దూకుడు

Published on Sun, 07/12/2026 - 04:46

సాక్షి, హైదరాబాద్‌: ఒకప్పుడు వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన తెలంగాణ.. ఇప్పుడు దేశ వ్యవసాయ పటంలో వేగంగా ఎదిగిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. వ్యవసాయరంగ పనితీరుకు కీలక సూచిక అయిన స్థూల రాష్ట్ర విలువ జోడింపు (జీఎస్‌వీఏ) వృద్ధిలో దేశంలోని అన్ని రాష్ట్రాలను తెలంగాణ అధిగమించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) హ్యాండ్‌బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ఆన్‌ ఇండియన్‌ స్టేట్స్‌ గణాంకాల ఆధారంగా రూపొందించిన విశ్లేషణలో.. 2016–17 నుంచి 2024–25 మధ్య తెలంగాణ వ్యవసాయ రంగం 6.9 శాతం సగటు వార్షిక వృద్ధి నమోదు చేసినట్లు వెల్లడైంది. 

దేశంలోని మరే రాష్ట్రం ఈ స్థాయి వృద్ధిని సాధించలేదు. వ్యవసాయ జీఎస్‌వీఏలో తెలంగాణ తర్వాత తమిళనాడు 5.99 శాతం, మణిపూర్‌ 5.59 శాతం, అస్సాం 5.45 శాతం, ఉత్తరప్రదేశ్‌ 5.28 శాతం వృద్ధితో నిలిచాయి. వ్యవసాయం, పశుసంవర్థక, మత్స్య తదితర ప్రాథమిక రంగాల్లో జరిగిన విస్తరణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయరంగ ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. 

సాగునీటి విస్తరణతో మారిన వ్యవసాయ ముఖచిత్రం 
తెలంగాణ వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులకు సాగునీటి విస్తరణ కీలకంగా మారింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ, నీటివనరుల వినియోగం పెరగడం వంటి అంశాలు పంటల సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపాయి. గతంలో అనేక ప్రాంతాల్లో వర్షాలపై ఆధారపడిన సాగు ఉండగా.. తర్వాతి కాలంలో నీటి లభ్యత పెరగడంతో పంటల సాగు విస్తరించింది. దీంతోపాటు రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి రావడం, వ్యవసాయ యాంత్రీకరణ పెరగడం, మార్కెట్‌ సదుపాయాలు మెరుగుపడటం వంటి అంశాలు ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడ్డాయి. వ్యవసాయ జీఎస్‌వీఏ అనేది కేవలం పంటల ఉత్పత్తినే కాకుండా.. పశుసంవర్థక, మత్స్య, అటవీ రంగాల విలువను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ రంగాల్లో వచ్చిన వృద్ధి కూడా తెలంగాణ వ్యవసాయ విలువ పెరుగుదలకు తోడ్పడింది. 

వరి ఉత్పత్తిలో రికార్డు స్థాయి వృద్ధి 
తెలంగాణ వ్యవసాయ రంగంలో అత్యంత స్పష్టంగా కనిపించిన మార్పు వరి సాగు విస్తరణ. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. సాగునీటి లభ్యత, రైతుల పంటల ఎంపికలో మార్పు, అధిక దిగుబడి వంగడాల వినియోగం, కొనుగోలు వ్యవస్థ వంటి అంశాలు వరి దిగుబడి పెరుగుదలకు కారణమయ్యాయి. రాష్ట్రం ఇటీవలి సంవత్సరాల్లో దేశంలో ప్రధాన ధాన్యం దిగుబడి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. 

ఖరీఫ్, రబీ సీజన్లలోనూ వరి సాగు విస్తరించడం వ్యవసాయ జీఎస్‌వీఏ పెరుగుదలలో కీలకపాత్ర పోషించింది. అదే సమయంలో పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్‌ వంటి పంటలు కూడా రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన స్థానాన్ని కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో ప్రముఖ రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది.  

అనుబంధ రంగాల అండతో పెరిగిన వ్యవసాయ విలువ 
వ్యవసాయరంగ వృద్ధిలో పశుసంవర్థక, మత్స్య రంగాల పాత్ర కూడా గణనీయంగా ఉంది. పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, మేకల పెంపకం, కోళ్ల పరిశ్రమ వంటి రంగాలు గ్రామీణ కుటుంబాలకు అదనపు ఆదాయ మార్గాలుగా మారాయి. అలాగే రాష్ట్రంలోని చెరువులు, రిజర్వాయర్ల ఆధారంగా మత్స్య సంపద పెరగడం కూడా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చింది. అయితే వ్యవసాయ రంగం ముందు సవాళ్లు కూడా ఉన్నాయి. వాతావరణ మార్పులు, వర్షపాతం అస్థిరత, సాగు వ్యయాల పెరుగుదల, మార్కెట్‌ ధరల హెచ్చుతగ్గులు రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయి. 

భవిష్యత్‌లో పంటల వైవిధ్యం, విలువ ఆధారిత వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్‌ రంగాల అభివృద్ధి కీలకంగా మారనుంది. ఆర్‌బీఐ హ్యాండ్‌బుక్‌ గణాంకాలు మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2016–17 నుంచి 2024–25 మధ్య కాలంలో తెలంగాణ వ్యవసాయ రంగం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వేగంగా విస్తరించింది. వ్యవసాయం, అనుబంధ రంగాల సమష్టి వృద్ధి రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. 

జీఎస్‌వీఏ అంటే.. 
ఒక రాష్ట్రంలో వ్యవసాయం, పశుసంవర్థక, మత్స్య, అటవీ వంటి ప్రాథమిక రంగాలు ఒక ఏడాదిలో సృష్టించే ఆర్థిక విలువను స్థూల రాష్ట్ర విలువ జోడింపు (జీఎస్‌వీఏ)గా పరిగణిస్తారు. ఆర్‌బీఐ హ్యాండ్‌బుక్‌లో ఈ గణాంకాలను స్థిర ధరల ఆధారంగా లెక్కిస్తారు. దీనివల్ల ధరల పెరుగుదల ప్రభావం కాకుండా వాస్తవ ఉత్పత్తి, వ్యవసాయరంగ విస్తరణను అంచనా వేయవచ్చు.   

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)