Breaking News

డీజీపీ టెలీ కాన్ఫరెన్స్‌లో సీపీ!

Published on Thu, 10/23/2025 - 06:32

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీసు విభాగానికి బాస్‌ డీజీపీ...రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన హైదరాబాద్‌ పోలీసు కమినరేట్‌కు బాస్‌ నగర కొత్వాల్‌. వీరిద్దరి మధ్యా సరైన సమన్వయం లేకపోతే..! గతంలో పని చేసిన డీజీపీలు, నగర పోలీసు కమిషనర్ల విషయంలో అదే జరిగింది. ఫలితంగా ప్రతి రోజూ ఉదయం డీజీపీ నిర్వహించే టెలీ కాన్ఫరెన్స్‌కు నగర కొత్వాల్‌గా పని చేసిన అధికారులు దూరంగా ఉంటూ వచ్చారు. డీజీపీగా బత్తుల శివధర్‌రెడ్డి, కొత్వాల్‌గా విశ్వనాథ్‌ చన్నప్ప సజ్జనర్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ పరిస్థితి మారింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి డీజీపీ నిర్వహిస్తున్న టెలీ కాన్ఫరెన్స్‌కు నగర పోలీసు కమిషనర్‌ కచి్చతంగా హాజరవుతున్నారు. 

ప్రతి రోజూ ఉదయం డీజీపీ నిర్వహించే ఈ కాన్ఫరెన్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల కమిషనర్లతో పాటు ప్రత్యేక విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రభుత్వం తీసుకున్న తాజా విధానపరమైన నిర్ణయాలను డీజీపీ వెల్లడిస్తుంటారు. దీనికి తోడు ముందు జరిగిన కీలక ఘట్టాలు, లోటుపాట్లు, ఆ రోజు జరుగనున్న కార్యక్రమాలపై సమగ్రంగా చర్చ జరుగుతుంది. ఆయా సందర్భాల్లో పోలీసు విభాగం అనుసరించాల్సిన వ్యూహాల పైనా దిశానిర్దేశం ఉంటుంది. ఇంతటి కీలకమైన డీజీపీ టెలీ కాన్ఫరెన్స్‌కు దాదాపు మూడున్నరేళ్లుగా పని చేసిన హైదరాబాద్‌ పోలీసు కమిషనర్లు దూరంగా ఉన్నారు. 

అసలు పాల్గొనకపోడం, అడపాదడపా పాల్గొనడంతో పాటు తమకు బదులుగా వేరొక ఆఫీసర్‌ హాజరయ్యేలా చేయడం వంటివి జరిగాయి. కొత్వాల్‌ కంటే జూనియర్లు డీజీపీలుగా ఉండటం, డీజీపీకి కొత్వాల్‌కు మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతో పాటు అనేక వ్యక్తిగత కారణాల వల్లా ఇలా జరిగింది. దీని ప్రభావం పోలీసింగ్‌పై పడటంతో పాటు అనేక లోటుపాట్లు చోటు చేసుకున్నారు. శివధర్‌రెడ్డి, సజ్జనర్‌ ఈ విధానానికి స్వస్తి చెప్పారు. సంప్రదాయ పద్దతుల్ని మళ్లీ అమలులోకి తీసుకువస్తూ డీజీపీ టెలీ కాన్ఫరెన్స్‌లో నగర పోలీసు కమిషనర్‌ కచి్చతంగా పాల్గొంటున్నారు. అనివార్య కారణాల నేపథ్యంలో హాజరుకాలేని పక్షంలో డీజీపీ అనుమతి తీసుకుంటున్నారు. ఇలా నగర, రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న ఇతర అధికారులకు బాస్‌ ఈజ్‌ బాస్‌ అనే స్పష్టమైన సంకేతం ఇస్తున్నారు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)