Breaking News

బీడీఎస్‌ వెబ్‌ ఆప్షన్లు షురూ

Published on Sun, 09/21/2025 - 06:33

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో స్టేట్‌ కోటా కింద బీడీఎస్‌ కోర్సులో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ మొదలైంది. కనీ్వనర్‌ (కాంపిటెంట్‌ అథారిటీ) కోటా కింద ప్రభుత్వ, ప్రైవేట్‌ డెంటల్‌ కళాశాలలు, ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌లో సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌) శనివారం వెబ్‌ ఆప్షన్ల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 22న మధ్యాహ్నం 1 గంట వరకు అభ్యర్థులు https:/ tsbdsadm. tsche. in/  లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈనెల 15న విడుదల చేసిన స్టేట్‌ కోటా ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌లో పేర్లు ఉన్న అభ్యర్థులకే ఈ అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వపరంగా ఉస్మానియా డెంటల్‌ కాలేజీతో పాటు ఆర్మీ డెంటల్‌ కాలేజీ ఉండగా, మరో 10 ప్రైవేటు డెంటల్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లోని సీట్ల కోసం ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 

ఫీజులు ఇలా... 
కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు రూ. 12,000 (ఆన్‌లైన్‌ ద్వారా) చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ట్యూషన్‌ ఫీజుల కింద ప్రభుత్వ డెంటల్‌ కళాశాలలకు ఏటా రూ. 10,000, ప్రైవేట్‌ డెంటల్‌ కళాశాలలకు ఏటా రూ. 45,000 చెల్లించాల్సి ఉంటుంది.  

రెండో రౌండ్‌లో నో చాన్స్‌.. 
బీడీఎస్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించి మొదటి దశలో ఆప్షన్లు వినియోగించని అభ్యర్థులకు తరువాతి రౌండ్లలో అవకాశం ఉండదు. కౌన్సెలింగ్‌లో సీటు కేటాయించబడిన తర్వాత చేరకపోతే, తదుపరి కౌన్సెలింగ్‌కు అర్హత ఉండదు. ఎన్ని కావాలంటే అన్ని కళాశాలలపై ఆప్షన్లు ఇవ్వొచ్చు. సీటు కేటాయింపుని వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. కేటాయింపు ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా లభిస్తుంది. సీటు వచ్చిన వారు యూనివర్సిటీ ఫీజు చెల్లించి అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ డౌన్‌లోడ్‌ చేసి, సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌ వద్ద ఒరిజినల్‌ సర్టీఫికెట్లు, బాండ్లు సమరి్పంచి ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ, ఆంగ్లో ఇండియన్, పీఎంసీ, క్యాప్‌ కేటగిరీల అభ్యర్థులకూ ఇదే విధానం వర్తిస్తుంది. 

హెల్ప్‌లైన్‌ నంబర్లు 
టెక్నికల్‌ హెల్ప్‌: 9392685856, 7842136688, 9059672216, అడ్మిషన్‌ నిబంధనలపై క్లారిటీ కోసం: 7901098840, 9490585796, పేమెంట్‌ సమస్యలు: 9618240276 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)