Breaking News

ఇంజనీరింగ్‌లో మరిన్ని  కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు

Published on Thu, 09/15/2022 - 00:40

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ మలి విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా మరిన్ని కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇదే క్రమంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ సీట్లు తగ్గిపో నున్నాయి. దీనిపై సాంకేతిక విద్య విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. కొత్తగా పెరిగే సీట్లలో ఎక్కువభాగం కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్‌ వంటి విభాగాల సీట్లే ఉండనున్నాయి.

కొన్ని కాలేజీల్లో సైబర్‌ సెక్యూరిటీ సీట్లను పెంచనున్నారు. గత మూడేళ్లుగా డిమాండ్‌ లేని బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకుని, వాటి స్థానంలో డిమాండ్‌ ఉన్న కోర్సుల సీట్లను పెంచుకునేందు కు అఖిల భారత సాంకేతిక విద్యశాఖ అనుమతించడంతో.. రాష్ట్రంలో కంప్యూటర్‌ సైన్స్, దాని అనుబంధ కోర్సుల్లో 9,240 సీట్లు పెరగనున్నాయి. ఈ నెల 28 నుంచి ఇంజనీరింగ్‌ మలి విడత కౌన్సెలింగ్‌లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

ఆ సీట్లు సగానికన్నా తక్కువే..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71,286 ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ కోర్సులకు పెద్దగా డిమాండ్‌ లేని పరిస్థితి ఉంది. మొత్తం సీట్లలో వీటి సంఖ్య సగానికన్నా తక్కువే. ఇలా డిమాండ్‌ లేని కోర్సుల రద్దు, వాటి స్థానంలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు అనుమతితో పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం సివిల్‌ విభాగంలో 5 వేలు, మెకానికల్‌లో 4,615, ఈసీఈ 12,219, ఈఈఈ 5,778 సీట్లు మాత్రమే రెండో విడత కౌన్సెలింగ్‌లో ఉండబోతున్నాయి.

మొత్తం కలిపి ఈ సీట్ల సంఖ్య 27,612 మాత్రమే. పెరిగే 9,240 కంప్యూటర్‌ కోర్సుల సీట్లను కలిపితే.. రెండో విడత ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లో మొత్తం సీట్ల సంఖ్య 80,526 సీట్లకు చేరనుంది. అంటే సంప్రదాయ కోర్సులు మూడో వంతుకు తగ్గిపోనున్నాయి. 52 వేలకుపైగా కంప్యూటర్‌ సైన్స్, సంబంధిత కోర్సుల సీట్లే ఉండనున్నాయి. ఇప్పటికే సీఎస్సీ సీట్లు 18,686, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సీట్లు 7,737 వరకు ఉన్నాయి. ఇవి గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇంకా 17 వేల సీట్లు ఖాళీ..
ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. కేటాయించిన సీట్లలో 17 వేల మేర అధికార వర్గాలు తెలిపాయి. తొలి దశలో 71,286 సీట్లు అందుబాటులో ఉంటే, 60,208 సీట్లను కేటా యించారు. ఇందులో 43 వేల మంది మాత్రమే కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేశారని తెలిపాయి. మిగిలిన సీట్లలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ సీట్లే ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాయి. ఈ సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. 

Videos

పథకాలు అమలు చేస్తున్న కానీ కాంగ్రెస్‌కి ప్రజల్లో వ్యతిరేకత

కెనడా విదేశాంగశాఖ మంత్రిగా అనితా ఆనంద్...

Chandrasekhar Reddy: విద్యా వ్యవస్థకు చంద్రగ్రహణం.. చంద్రబాబుపై ఫైర్

Rain Alert: అరేబియా సముద్రంలో బలపడుతున్న గాలులు

జనసేనలో భగ్గుమన్న వర్గ విభేదాలు

బలూచ్ గడ్డపై జెండా పాతిన తొలి హిందూ యువతి

హైదరాబాద్ మెట్రోరైల్ రెండో దశ రెండో భాగం నిర్మించేందుకు కసరత్తు

Miss World Contestants: రామప్ప, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట సందర్శన

వైఎస్ జగన్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

బయటపడుతున్న తుర్కియే కుట్రలు

Photos

+5

Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)