Breaking News

ప్రజాధనం దుర్వినియోగమైనట్లు నివేదికలో స్పష్టమైంది: మంత్రి ఉత్తమ్‌

Published on Mon, 08/04/2025 - 19:00

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.  ఈరోజు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) తెలంగాణ కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం ఉత్తమ్‌ ఆ సమావేశం బ్రీఫింగ్‌ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజ్‌లో చాలా లోపాలున్నట్లు సీడబ్యూసీ చెప్పిందని, తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదనడం సరైంది కాదని ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికలో స్పష్టమైనట్లు ఆయన పేర్కొన్నారు.  మేడిగడ్డ బ్యారేజ్‌ వద్దని హై పవర్‌ కమిటీ ఇచ్చిన నివేదికను కేసీఆర్‌ పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఉత్తమ్‌ విమర్శించారు.

ప్రజాధనం దుర్వినియోగం చేశారు..
‘మేడిగడ్డ కుంగిపోవడానికి కేసీఆర్‌ ప్రధాన కారణమని పీసీ ఘోష్‌ కమిషన్‌ నిర్ధారించింది. మొత్తం ఆర్థిక అవతవకలు, అవినీతి, ప్లానింగ్‌, డిజైనింగ్‌ అంతా కేసీఆర్‌ పర్యవేక్షణలోనే జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడేలా మేడిగడ్డ బ్యారేజ్‌ అంచనాలు పెంచి నిర్మించారు. కాళేశ్వరం కమిషన్‌కు హరీష్‌రావు సరైన సమాచారం ఇవ్వలేదు. మేడిగడ్డ కరెక్ట్‌ ప్రదేశంలో కట్టలేదు. కాంట్రాక్టర్స్‌కు ఫేవర్‌గా చూడటానికి ప్రజాధనం దుర్వినియోగం చేశారు’ అని ఉత్తమ్‌ తెలిపారు.

ఇష్టానుసారం ప్రాజెక్టుల డిజైన్‌ మార్చేశారు..
‘కాగ్‌, ఎన్‌డీఎస్‌ఏ నివేదికలను ఘోష్‌ కమిషన్‌ పరిశీలించింది. కమిషన్‌ నివేదికపై కేబినెట్‌లో చర్చించాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునాదుల్లోనే సమస్యలు. కేసీఆర్‌ ఇష్టానుసారం ప్రాజెక్ట్‌ డిజైన్‌ మార్చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును గతంలోనే నిర్ణయించారు. 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా డిజైన్‌ చేశారు. కేసీఆర్‌ ఇష్టానుసారం ప్రాజెక్టు డిజైన్‌లు మార్చేశారు. అధిక వడ్డీకి ఎన్‌బీఎఫ్‌  దగ్గర  లోన్లు తెచ్చారు. అధిక వడ్డీలకు రూ. 84 వేల కోట్ల ురుణాలు తీసుకొచ్చారు. రుణాలు తెచ్చే విషయంలో అవతవకలకు పాల్పడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాళేశ్వరంపై విచారణ.  పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికను 25 పేజీలకు కుదించాం’ అని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)