Breaking News

బుద్ధి వైకల్యం ప్రమాదకరం.. స్మితా సబర్వాల్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం

Published on Tue, 07/23/2024 - 10:39

హైదరాబాద్‌, సాక్షి: అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం చాలా ‍ప్రమాదకరమని అంటున్నారు తెలంగాణ మంత్రి సీతక్క. ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ దివ్యాంగుల కోటా కామెంట్లపై నెలకొన్న వివాదంపై మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా సీతక్క తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

‘‘అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం ప్రమాదకరం. అంతా అవగాహన ఉందని మాట్లాడే వాళ్లు.. ఇతరుల అభిప్రాయలు గుర్తించకపోవడం కరెక్ట్‌ కాదు. అది వాళ్ల మానసిక వైకల్యం. ఐపీఎస్‌కు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ అవసరం. పోలీసులకు కలెక్టర్లకు తేడా తెలియదా?..

.. ఒక అధికారిగా ఉండి ఆమె అలా మాట్లాడడం తప్పు. ఆమె అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆమె వ్యాఖ్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా’’.. అని మంత్రి  సీతక్క అన్నారు.

సాక్షితో స్మితా సబర్వాల్‌
ఇదిలా ఉంటే.. తన ఎక్స్‌ పోస్ట్‌ వివాదం కావడంతో ఆమె నిన్న దానికి వివరణ ఇచ్చారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని, తాను తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని అన్నారామె. ఆపై వివాదం మరింత ముదిరింది. ఆమెపై ఇటు తెలంగాణలో, అటు ఏపీలోనూ పీఎస్‌లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. తాజాగా ఆమె సాక్షి టీవీ తో ఫోన్ లైన్‌లోనూ మాట్లాడారు. ‘‘నేను ఎవరినో కించపరచడానికో లేదంటే కాంట్రవర్సీ కోసమో ఆ వ్యాఖ్యలు చెయ్యలేదు. యూపీఎస్సీలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం నుంచి సీనియర్, ఫీల్డ్ వర్క్ చేసిన అధికారుల అభిప్రాయం తీసుకుంటుంది. రిజర్వేషన్ల అంశంలో నేను నా అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేశాను.. అని అంటున్నారామె.

ఐఏఎస్ అంటే బాడీతో కాదు బ్రెయిన్ తో పనిచేయాలి..

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)