Breaking News

ఆపరేషన్ సిందూర్.. తెలంగాణ మంత్రి నినాదాలు

Published on Wed, 05/07/2025 - 18:56

సిద్దిపేట, సాక్షి: పెహల్గాంలో 28 మంది అమాయక పౌరుల ప్రాణాలు తీసి పాకిస్తాన్‌లో నక్కిన ఉగ్రమూకలను ఏరివేయడమే లక్ష్యంగా భారత్‌ సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయవంతం కావడంపై దేశవ్యాప్తంగా జయజయధ్వానాలు మోరుమోగుతున్నాయి. అమాయకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పారంటూ ప్రశంసిస్తున్నారు. దీనిపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు.

సిద్దిపేట జిల్లా కోహెడ గ్రామంలో 41 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై హర్షం వ్యక్తం చేస్తూ భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడి ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంపై గట్టి చప్పట్లతో అభినందనలు తెలుపుతున్నానన్నారు.

రాజకీయాలు, పార్టీలకతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పూర్తి మద్దతు తెలుపుతున్నామన్న పొన్నం.. ‘కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటు, అన్ని పార్టీల నాయకులు ఈ చర్యను సమర్థిస్తున్నాయి. ఉగ్రవాదుల చర్యలకు బుద్ధి చెప్పే విధంగా సైనిక చర్యలు ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. దేశ సమగ్రతకు పాటుపడుతున్న సైనిక చర్యలకు మద్దతు ఇస్తున్నాం. భారత సైనికులకు శుభాకాంక్షలు, అభినందనలు’ అని పేర్కొన్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)