Breaking News

‘ఒక్క ఓటుతో ఓడినా.. సర్పంచ్‌ నేనే’

Published on Tue, 12/23/2025 - 08:10

నార్కట్‌పల్లి: మండల పరిధిలోని చిన్ననారాయణపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ రోజు కాంగ్రెస్‌ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థి మెరుగు అనితకు, బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి జంగిలి అనితకు సమాన ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు టాస్‌ వేసి బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి జంగిలి అనిత గెలుపొందినట్లు ప్రకటించారు. 

కాగా ఈ నిర్ణయంపై కాంగ్రెస్‌ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తిరిగి రీకౌంటింగ్‌ నిర్వహించగా.. కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థి మెరుగు అనిత ఒక ఓటుతో బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థిపై గెలిచినట్లు ధ్రువీకరణ చేశారు. అయితే సోమవారం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం  సందర్భంగా గ్రామంలో ఒక్క ఓటుతో ఓడిపోయినా.. సర్పంచ్‌ నేనే అంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ ఉమేష్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 పోలీసులు గ్రామ పంచాయతీ సిబ్బందితో ఫ్లెక్సీలను తొలగించారు.  కాగా గ్రామ పంచాయతీలో 8 వార్డులకు గాను ఐదు వార్డులు బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా.. ముగ్గురు కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. సోమవారం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఉప సర్పంచ్, బీఆర్‌ఎస్‌ బలపర్చిన వార్డు సభ్యులు హాజరు కాలేదు. దీంతో కేవలం సర్పంచ్‌తోపాటు ముగ్గురు కాంగ్రెస్‌ వార్డు సభ్యులతో మాత్రమే ఎంపీడీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. 

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)