Breaking News

Local Body Elections: ఎవ్రీడే 90 ఎంఎల్‌..!

Published on Wed, 12/10/2025 - 09:34

వరంగల్ జిల్లా: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ఆసక్తి కలిగిస్తోంది. ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు అభ్యర్థులు ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. పోలింగ్‌ జరిగే రెండు, మూడు రోజుల ముందు నుంచి గ్రామాల్లో తమకు అనుకూలమైన వారికి, వ్యతిరేకులకు మద్యం తాగిస్తున్నారు. తమ గెలుపు కోసం రోజూ ప్రచారం చేసే బ్యాచ్‌తో పాటు.. తమకు తప్పకుండా ఓటు వేస్తారనే నమ్మకం ఉన్నవారికి, తమకు ఓటు వేయరేమో అనే అనుమానంతో ఉన్న వారికి ప్రతీ రోజు 90 ఎంఎల్‌ మద్యం డోర్‌ డెలివరీ చేస్తున్నారు. దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని వైన్‌ షాపుల నిర్వాహకులు 90 ఎంఎల్‌ మద్యం బాటిళ్లను ఎక్కువ స్టాక్‌ చేసుకుంటున్నారు. ఇలా ప్రతీ రోజూ 90 ఎంఎల్‌ మద్యం అభ్యర్థులు ఇంటికే పంపిస్తుండడంతో కొందరు ఓటర్లు ఆనంద పడుతున్నారు. 

వాళ్ల దావత్‌కు పోయివస్తా.. ఓటు మాత్రం నీకే
సంగెం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల విచిత్రాలు సర్పంచ్‌ అభ్యర్థులను ఖంగుతినిపిస్తున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు దావత్‌లు ఏర్పాటు చేసి ఓటర్లను ఆహ్వానిస్తున్నారు. దీంతో ఓటర్లు ఎవరి మాట కాదనలేక పిలిచిన ప్రతీ అభ్యర్థి దావత్‌కు, విందులకు వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఎవరైనా అభ్యర్థి తారసపడి గా దావత్‌కు ఎందుకు పోయినవే అడితే పిలిస్తే పోకపోతే బాగుండదని వెళ్లిన గాని ఓటు మాత్రం నీకే వేస్తా అంటూ మభ్యపెట్టుతున్నారు. ఇంకాకొందరైతే ముందుగానే అభ్యర్థితో  గా అభ్యర్థి దావత్‌కు పిలిచిండు పోయి వస్తా ఏమి అనుకోవద్దు అంటూ వెళ్లొస్తున్నారు. అంతేగాక అక్కడ గా మందు బ్రాండ్‌ పెట్టారని, ఇక్కడ ఈ మందు బ్రాండ్‌ పెట్టుతున్నారని విమర్శలు సైతం చేస్తూ దావత్‌లు ఇచ్చిన వారినే మాటలు అంటున్న పరిస్థితి గ్రామాల్లో కొనసాగుతుందని పలువురు అభ్యర్థులు      వాపోతున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)