Breaking News

చిన్న భార్య విత్‌డ్రా...పెద్ద భార్య ఏకగ్రీవ సర్పంచ్‌

Published on Sun, 12/07/2025 - 10:50

మిరుదొడ్డి(దుబ్బాక): సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్‌ పదవికి నర్సింహారెడ్డి ఇద్దరు భార్యలు లావణ్య, రజిత నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కూడా. శనివారం రజిత తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంది. దీంతో లావణ్య ఒక్కరే పోటీలో ఉండటంతో సర్పంచ్‌ పదవి ఏకగ్రీవమైంది. పంచాయతీ పరిధిలోని 10 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి.

భర్త నామినేషన్‌ రిజెక్ట్‌.. భార్య అభ్యర్థిత్వానికి ఓకే
స్కూల్‌ అసిస్టెంట్, అంగన్‌వాడీ టీచర్‌ ఉద్యోగాలు వదిలి... 
ఇబ్రహీంపట్నం రూరల్‌: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్‌లో సర్పంచ్‌ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. దీంతో గ్రామానికి చెందిన స్కూల్‌ అసిస్టెంట్‌ బింగి రాములయ్య ఓ రాజకీయ పార్టీ మద్దతుతో సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేశారు. మరో పది నెలల సర్వీస్‌ ఉండగానే వీఆర్‌ఎస్‌ కోసం ప్రయత్నించారు. ఇందులో భాగంగా అక్టోబర్‌ 30న తన రాజీనామా పత్రాన్ని డీఈఓ సుశీందర్‌రావుకు అందజేశారు. రాములయ్య సతీమణి బింగి గీత సైతం ఇదే గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 5న తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్‌ పీడీకి లేఖ అందజేశారు. అనంతరం ఆమె కూడా సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. గీత రాజీనామాకు సంబంధిత శాఖ నుంచి ఎన్‌ఓసీ జారీ కాగా, ఆమె అభ్యర్థిత్వానికి మార్గం సుగమమైంది. కానీ, విద్యాశాఖ నుంచి రాములయ్యకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ అందకపోవడంతో ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. 

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)