Breaking News

గెలిపిస్తే.. ప్రతి ఇంటికి వైఫై

Published on Sat, 12/06/2025 - 07:49

సంగారెడ్డి టౌన్‌: ఒకప్పుడు పల్లెల్లో రాజకీయాలంటే పెద్దల పెత్తనాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. గ్రామ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసేందుకు యువత ముందుకు వస్తున్నారు. ఇది ఎన్నికల ఉత్సాహం మాత్రమే కాదు, గ్రామాల్లో నాయకత్వ మార్పునకు, అభివృద్ధిలో భాగస్వామ్యానికి యువత ముందుకు వస్తున్నామని చెబుతున్నారు. సంగారెడ్డి మండలంలోని 11 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్‌ అభ్యర్థులుగా అక్కడక్కడ యువకులు పోటీ పడుతున్నారు. మండలంలోని పసల్వాది గ్రామంలో 27 ఏళ్ల యువకుడు హరి ప్రసాద్‌ ముదిరాజ్‌ ఎంబీఏ పూర్తి చేశాడు. 

సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. పంచభూతాల సాక్షిగా ఐదు హామీలు అంటూ మ్యానిఫెస్టో విడుదల చేశాడు. పట్టణాలకు దీటుగా తన గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని సరికొత్తగా ఎన్నికల వ్యూహాన్ని రచించి ముందుకు వెళుతున్నాడు. తాను గెలిస్తే గ్రామంలో ఇంటింటికి ఉచిత వైఫై, విద్యార్థులకు ట్యాబ్‌లు, యువతకు ఉపాధి, మహిళలకు ఉపాధి శిక్షణ, గ్రామంలో బస్సులు ఆగేలా బస్‌ స్టాప్, వివిధ రకాల సదుపాయాలు కల్పిస్తానని సరికొత్త మ్యానిఫెస్టోను రూపొందించుకొని ప్రచారం నిర్వహిస్తున్నాడు. దీంతో మండల వ్యాప్తంగా ఈ యువకుడి ప్రచారం ఆసక్తిని కలిగిస్తోంది.

 

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)