Breaking News

బరిలో విద్యావంతులు, దంపతులు

Published on Thu, 12/04/2025 - 12:28

ఖమ్మం జిల్లా: కొణిజర్ల సర్పంచ్‌ అభ్యర్థిగా అదే గ్రామానికి చెందిన గూదె పుష్పావతి పోటీలో నిలిచా రు. ఆమె ఎం.ఫార్మసీ చదివి కొద్దిరోజులు ఉద్యోగం చేశారు. కొణిజర్లకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గూదె ఉపేందర్‌తో వివా హం జరిగింది. కొణిజర్ల పంచా యతీ రిజర్వేషన్‌ బీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో సర్పంచ్‌గా పోటీలో నిలిచింది. 

 కూసుమంచిలో.. 
కూసుమంచి: మండలంలో పలువురు విద్యావంతులు సర్పంచ్, వార్డు స్థానాల్లో బరి లో దిగారు. నేలపట్ల గ్రా మానికి చెందిన అలవాల లింగయ్య ఆర్జేసీ డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుండగా ఆయన బీఆర్‌ఎస్‌ మద్దతుదారుడిగా నేలపట్ల సర్పంచ్‌ స్థానంలో బరిలో నిలిచారు. కూసుమంచి నుంచి కొండా కృష్ణవేణి కాంగ్రెస్‌ మద్దతుదారుగా సర్పంచ్‌ బరిలో దిగగా డిగ్రీ చదివిన ఆమె ఎంపీడీఓ కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం చేస్తున్నారు. 

ఇదే పంచాయతీలో ఇంజనీరింగ్‌ కళాశాలలో ఫ్యాకలీ్టగా పనిచేస్తున్న గుండా ఉపేందర్‌రెడ్డి 8వ వార్డు నుంచి బీజేపీ మద్దతుదారుడిగా బరిలో దిగారు. సీపీఎం మద్దతుదారుగా డిగ్రీ చదివిన సల్వాది బేబీరాణి సర్పంచ్‌గా బరిలో ఉన్నారు. కూసుమంచి 12వ వార్డుకు బీఆర్‌ఎస్‌ తరఫున అర్వపల్లి ఉపేందర్‌ నామినేషన్‌ దాఖలు చేయగా ఆయన భార్య రేణుక నాలుగో వార్డు నుంచి బరిలో ఉన్నారు. గట్టుసింగారం గ్రామానికి చెందిన వాచేపల్లి హనుమారెడ్డి కాంగ్రెస్‌ తరఫున 2వ వార్డులో బరిలో నిలవగా అతడి భార్య స్వరూప 6వ వార్డు నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు.

 

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)