Breaking News

లిక్కర్‌ బకాయిలు రూ. 2వేల కోట్లకు పైనే!

Published on Fri, 01/10/2025 - 01:43

సాక్షి, హైదరాబాద్‌: మద్యం సరఫరా చేసే కంపెనీలకు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ చెల్లించాల్సిన బకాయిలు రూ.2 వేల కోట్లకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. లిక్కర్‌తో పాటు బీర్లు తయారు చేసే కంపెనీలన్నింటికీ కలిపి ఈ మేరకు బకాయిలు ఉన్నాయని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వ హయాం నుంచే ఈ బకాయిలు కొనసాగుతున్నాయని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒప్పందం మేరకు 45 రోజులకు బిల్లులు చెల్లిస్తున్నారే కానీ పాత బకాయిలు మాత్రం విడుదల చేయడం లేదని పేర్కొంటున్నాయి. 

బకాయిలు కొనసాగుతుండడాన్ని కంపెనీలు భరించలేకపోతున్నాయని, ఈ నేపథ్యంలోనే యూబీ కంపెనీ పరిణామం చోటు చేసుకుందని తెలుస్తోంది. యూబీతో పాటు బీర్లు సరఫరా చేసే ఏబీ, ఇతర లిక్కర్‌ కంపెనీలు కూడా బిల్లుల ఉక్కిరిబిక్కిరిలోనే ఉన్నాయనే చర్చ ఎక్సైజ్‌ వర్గాల్లో జరుగుతోంది. తమకు బకాయిలు చెల్లించని కారణంగా సరఫరా నిలిపివేస్తామంటూ ఆరు నెలల క్రితమే యూబీ కంపెనీ నుంచి ఎక్సైజ్‌ శాఖకు లేఖ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే తాము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బిల్లులు క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నందున ప్రభుత్వం ధీమాతో ఉందని సమాచారం. 

యూబీ లేఖతోనే తెరపైకి ‘సోం’!
సరఫరా నిలిపివేస్తామంటూ యూబీ లేఖ రాసిన నేపథ్యంలోనే ఎక్సైజ్‌ వర్గాలు ముందుచూపుతో మరో డిస్టిలరీకి అనుమతినిచ్చే ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. లిక్కర్‌ కంపెనీలకు ఉండే ‘రాజకీయ’ సంబంధాల కారణంగా, యూబీకి చెక్‌ పెట్టాలనే యోచనతో ప్రభుత్వం కూడా ప్రోత్సహించిందని, ఈ పరిస్థితుల్లోనే సోం డిస్టిలరీస్‌ అనే మరో బీర్ల కంపెనీ తెరపైకి వచ్చిందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ డిస్టిలరీకి అనుమతుల వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో సదరు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. అయితే ఇప్పుడు యూబీ నిర్ణయం నేపథ్యంలో.. ఆ కంపెనీ అడిగిన విధంగా మద్యం సరఫరా చేసే కంపెనీల బేసిక్‌ ధరలను పెంచడం లేదంటే బీర్ల తయారీ కోసం సోం డిస్టిలరీస్‌ లాంటి కంపెనీలకు అనుమతులివ్వడం తప్ప ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేదని అధికారులు అంటున్నారు.

ఇతర మద్యం బ్రాండ్లకు కొరత !
యూబీ కంపెనీ నిర్ణయంతో కింగ్‌ఫిషర్‌ బీర్లు డిపో లకు రావడం నిలిచిపోయింది. దీంతో బుధవారం నాటికి డిపోల నుంచి తీసుకున్న బీర్లు మాత్రమే ప్రస్తుతం వైన్‌షాపుల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ బీర్లు వారం వరకు సరిపోతాయని, అప్పటికి పరిష్కారం రాకపోతే కింగ్‌ ఫిషర్‌ బీర్ల కొరత ఏర్పడుతుందని ఎక్సైజ్‌ వర్గాలంటున్నా యి. ఇదిలావుంటే ఇతర మద్యం బ్రాండ్లకు ఇప్పటికే మార్కెట్‌లో కొరత వచ్చిందని తెలుస్తోంది. సియా గ్రామ్స్‌ అనే కంపెనీ తయారు చేసే 100 పైపర్స్, బ్లెండర్స్‌ ప్రైడ్, రాయల్‌స్టాగ్‌ లాంటి ప్రీమియం బాండ్ల సరఫరా నిలిచిపోయిందని సమా చారం. దీంతో ఇప్పటికే మార్కెట్‌లో ఆయా బ్రాండ్లు దొరకడం లేదని వైన్‌షాపుల యజమానులు చెపుతు న్నారు. అయితే ఇందుకు వికారాబాద్‌ జిల్లాలోని ఒక డిస్టిలరీని ప్రభుత్వం మూసివేయడమే కారణమని, ఈ డిస్టిలరీలోనే సియాగ్రామ్స్‌ ప్రీమియం బ్రాండ్లు తయార వుతాయని, అందుకే ఆయా బ్రాండ్లు మార్కెట్‌లోకి రావడం లేదని ఎక్సైజ్‌ వర్గాలు వెల్లడించాయి.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)