Breaking News

సర్వం సిద్ధం..

Published on Mon, 02/12/2024 - 04:35

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మేడారం మహాజాతర కుంభమేళాకు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఆదివారం ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం మేడారంలో శ్రీ సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని పూజలు చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు.

ఈనెల 21 నుంచి 24 వరకు జరిగే మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, జంపన్నవాగుపై స్నాన ఘట్టాలు, క్యూ లైన్లు, తాగునీరు, రోడ్లు, బస్టాండ్‌ పనులు పూర్తయ్యాయని తెలిపారు.  ఈనెల 23న సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్‌తో పాటు రాష్ట్రపతి మేడారానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్‌ శ్రీజ, ఐటీడీఏ పీఓ అంకిత్, ఎస్పీ డాక్టర్‌ శబరీశ్, ఈఓ రాజేంద్రం పాల్గొన్నారు.  

ఈనెల 14న మండమెలిగె పండుగ 
మహాజాతర ప్రారంభానికి ఇంకా తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. ఆదివారం కూడా తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. 14న బుధవారం సమ్మక్క– సారలమ్మ పూజారులు మండమెలిగె పండుగ  నిర్వహించనున్నారు. 

ఉత్సవ కమిటీ చైర్మన్‌గా లచ్చుపటేల్‌ 
సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ నియమించింది. చైర్మన్‌గా అరెం లచ్చుపటేల్, కమిటీ సభ్యులుగా మిల్కూరి అయిలయ్య, కోడి గోపాల్, గంగెర్ల రాజారత్నం, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, యాప అశోక్, పోరిక నారాయణ్‌సింగ్, ముంజల భిక్షపతి, సుంచ హైమావతి, చామర్తి కిషోర్, కొరం అబ్బయ్య, ఆలం శశిధర్, వద్దిరాజు రవిచంద్ర, అంకం క్రిష్ణస్వామి, ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావును నియమించారు. చైర్మన్‌తో పాటు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం త్వరలో చేయనున్నట్లు తెలిసింది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)