Breaking News

మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘ఉద్యమిక’

Published on Wed, 03/09/2022 - 02:30

దినదినాభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, డిఫెన్స్, ఇతర నూతన రంగాల్లో ఉన్న అవకాశాలను మహిళా పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలి. సంప్రదాయ, చిన్నచిన్న ఉత్పత్తి రంగాలకే పరిమితం కాకుండా నూతన రంగాలపైనా దృష్టి సారించాలి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పార్క్‌ ఏర్పాటు చేయడం దేశంలోనే మొట్టమొదటిసారి.    – కేటీఆర్‌

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ‘ఉద్యమిక ’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. సింగిల్‌ విండో విధానంలో పనిచేసే ఈ విభాగం మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభు త్వం అందించే ప్రోత్సాహకాలను, ఇతర అంశా లను ఎప్పటికప్పుడు సమీక్షించి వారికి అండగా నిలుస్తుందన్నారు.

పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి, పటాన్‌చెరులో మంగళవారం నిర్వహిం చిన పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. సంగారెడ్డి పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో ఫ్లో(ఫిక్కి లేడీస్‌ ఆర్గనైజేషన్‌) ఇండస్ట్రియల్‌ పార్క్‌ను ఆయన ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. మహిళా పారిశ్రామికవేత్తల పారిశ్రామికో త్పత్తిని సులభతరం చేసేందుకు కార్పస్‌ఫండ్‌ సైతం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళల కోసమే ఏర్పాటు చేసిన ఈ ఫ్లో ఇండస్ట్రియల్‌ పార్కులో 50 ఎకరాలను 25 మంది మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం కేటాయించిం దన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పార్క్‌ ఏర్పాటు చేయడం దేశంలోనే మొట్టమొదటిసారని చెప్పారు. 

వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు...
కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో 66 శాతం హైదరాబాద్‌లోనే జరిగిందని, హైదరాబాద్‌ దేశానికి ఫార్మా క్యాపిటల్‌గా అవతరిస్తోందని అన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేం దుకు ఏర్పాటు చేసిన ‘వీ హబ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌’ సేవలను వినియోగించుకోవాలని మహి ళా పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రూ.4.90 లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) ఇప్పుడు రూ.11.50 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 130 శాతం వృద్ధి సా«ధించిందని పేర్కొన్నారు.

ఆ అగ్ని ప్రమాదంతోనే ‘కల్యాణలక్ష్మి’కి శ్రీకారం
పటాన్‌చెరు టౌన్‌: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ‘కల్యాణలక్ష్మి’ పథకానికి పునాది ఓ అగ్ని ప్రమా దమని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. మంగళ వారం పటాన్‌చెరు పట్టణంలోని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిం చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఒకసారి పల్లెనిద్రలో భాగంగా మహబూ బాబాద్‌లోని ఓ తండాకు వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి కేసీఆర్‌ వద్దకు వచ్చి తన కూతురు వివాహం కోసం దాచుకున్న డబ్బు, ఇల్లు అగ్ని ప్రమాదం లో కాలిపోయాయని తన బాధను చెప్పుకున్నా డని కేటీఆర్‌ వివరించారు.

ఆ తండ్రి వేదన, ఆ అగ్నిప్రమాదం బాధ నుంచి కేసీఆర్‌కు వచ్చిన ఆలోచనే కల్యాణలక్ష్మి పథకమని వెల్లడించారు. రూ.9వేల కోట్లతో పథకాన్ని ప్రారంభించి ఇప్పటివరకు పది లక్షల మంది ఆడపిల్లలకు ఆర్థికసాయం అందజేసి సీఎం కేసీఆర్‌ ఓ మేనమామలా నిలిచారని మంత్రి తెలిపారు.

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)