Breaking News

కరీంనగర్‌లో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

Published on Sun, 02/12/2023 - 19:14

గంగాధర(చొప్పదండి): చదువంటే ఇష్టం లేక, హాస్టల్‌లో ఉండలేక ఓ పదో తరగతి విద్యార్థిని పాఠశాల భవనం మూడో ఆంతస్తు నుంచి కిందకు దూ­కి ఆత్మహత్యకు యతి్నంచింది. అయితే ప్రాణాపాయం తప్పిపోగా, కాలువిరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గంగాధర ఎస్సై రాజు వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌ గ్రామానికి చెందిన స్వప్న– లక్ష‍్మీనారాయణ కూతురు హాసిని గంగాధర మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే విద్యాలయంలో పదోతరగతి చదువుతోంది.

అయితే చదువంటే ఇష్టం లేదని, హాస్టల్‌లో ఉండనని మొండికేసి కొద్దిరోజులుగా ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు కుమా­ర్తెను బ్రతిమిలాడి ఒప్పించి ఐదురోజుల క్రితం హాస్టల్‌లో చేర్పించి వెళ్లారు. ఆదివారం సాయంత్రం హాసిని వసతిగృహం మూడో అంతస్తుపైకి వెళ్లిం­ది. అక్కడికి ఎవరూ రాకుండా తలుపులు బిగిం­చి వెళ్లి రెయిలింగ్‌పై కూర్చొంది. ఉపాధ్యాయు లు, విద్యార్థులు గమనించి వారించినా వినకుండా పైనుంచి దూకేసింది. అయితే ఎడమకాలు విరిగి, ప్రాణాపాయం తప్పింది. తీవ్రంగా గాయపడిన హాసినిని కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.

Videos

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

కోమటిరెడ్డి Vs అనిరుధ్ రెడ్డి.. డిండి నీళ్ల పంచాయితీ

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)