Breaking News

జూడాల మధ్య చిచ్చుపెట్టిన సమ్మె విరమణ!

Published on Wed, 06/26/2024 - 09:27

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె.. వాళ్లలో వాళ్లకే చిచ్చు రాజేసింది. జూడాలు రెండుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. సమ్మె విరమించినట్లు జూడాల ప్రెసిడెంట్‌ ప్రకటించిన వేళ.. ఉస్మానియా జూడాలు మాత్రం సమ్మె కొనసాగుతోందని ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తెలంగాణలో జూడాల సమ్మె విరమణ..  గాంధీ ఆస్పత్రి వర్సెస్‌ ఉస్మానియా ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్ల అంశంగా మారిందిప్పుడు. బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం  నిధుల విడుదల, కాకతీయ యూనివర్సిటీ రోడ్ల మరమ్మత్తుల నిధుల విడుదల బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం  నిధులు విడుదల.. ఈ రెండు హామీలతో సమ్మె విరమిస్తున్నట్లు(తాత్కాలికంగానే) జూనియర్‌ డాక్టర్ల ప్రెసిడెంట్‌ ప్రకటించారు.

అయితే..  ప్రభుత్వం ముందు ఎనిమిది డిమాండ్లు ఉంచామని, అందులో కేవలం రెండు డిమాండ్లను మాత్రమే ప్రభుత్వం అంగీకరిస్తే సమ్మె ఎలా విరమిస్తారని ఉస్మానియా జూనియర్‌ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గాంధీ ఆస్పత్రి జూడాలు ప్రభుత్వానికి  లొంగిపోయారంటూ ఆరోపిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం తమ ప్రధాన డిమాండ్‌ అని, ప్రభుత్వం నుంచి ఈ డిమాండ్‌పై స్పష్టమైన హామీ వచ్చేదాకా యధావిధిగా సమ్మె కొనసాగిస్తామని వారంటున్నారు.

ఈ క్రమంలో జూడా జనరల్‌ సెక్రటరీ ఉస్మానియా జూడాలకు మద్దతుగా నిలవడంతో.. ఈ వ్యవహారం ఏ మలుపు తిరగబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. 

ప్రభుత్వం మా మధ్య చిచ్చు పెట్టింది ' ఎట్టి పరిస్థితిలో సమ్మె ఆగదు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)