Breaking News

ప్రజల ముంగిటకు పౌరసేవలు

Published on Fri, 01/10/2025 - 01:07

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. టెక్నాలజీ సాయంతో నిపుణులను భాగస్వాములను చేస్తూ పౌర సేవలను ప్రజల ముంగిటకు చేరవేస్తున్నామన్నారు. తెలంగాణ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ సర్వీసెస్‌ డెలివరీ (ఈఎస్డీ) రూపొందించిన ‘మీ టికెట్‌’యాప్‌ను గురువారం సచివాలయంలో శ్రీధర్‌బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్ని రకాల టికెట్‌ బుకింగ్స్‌ను ఒకే ప్లాట్‌ ఫాం పైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్‌ను రూపొందించామన్నారు.

భవిష్యత్తులో ఇదే తరహాలో మరిన్ని యాప్‌లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ‘ఈ యాప్‌లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్‌ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ప్లే అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్స్‌ కు సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్‌ కాంప్లెక్స్‌లను బుక్‌ చేసుకోవచ్చు.

పర్యాటకులు ఎంచుకున్న లొకేషన్‌కు సమీప ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలుంటే.. ఆ సమాచారం కూడా యాప్‌లో ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఈ యాప్‌ ను చాలా సులువుగా వినియోగించుకోవడంతో పాటు యూపీఐ ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చు. ఇతర ప్లాట్‌ఫాంల మాదిరిగా ఈ యాప్‌ లో అదనంగా ఎలాంటి చార్జీలను వసూలు చేయం’అని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మీ సేవ కమిషనర్‌ రవికిరణ్, పరిశ్రమల శాఖ కమిషనర్‌ డా.జి.మల్సూర్, జూపార్క్స్‌ డైరెక్టర్‌ డా.సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)