ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ‘టీ-ఫైబర్’ ఇంటర్నెట్: మంత్రి శ్రీధర్ బాబు

Published on Tue, 08/04/2026 - 21:10

సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో డిజిటల్ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కేవలం ‘టీ-ఫైబర్’ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు.

సచివాలయంలో మంగళవారం నిర్వహించిన 'టీ-ఫైబర్' ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాలు ప్రకటించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమావేశం సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..నిర్దేశిత గడువులోగా (సెప్టెంబర్ 1) రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా ప్రైవేట్ ఇంటర్నెట్ ఆపరేటర్లను ఉపయోగిస్తే, వారికి ఎలాంటి ప్రభుత్వ బిల్లులు చెల్లించబోమని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం చలామణిలో ఉన్న టీ-స్వాన్ నెట్‌వర్క్‌ను రాబోయే నెల రోజుల్లోగా పూర్తిగా టీ-ఫైబర్ పరిధిలోకి బదిలీ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ప్రభుత్వ శాఖల మధ్య సమాచార మార్పిడి మరింత వేగవంతం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఫ్యూచర్ సిటీ'కి కూడా పూర్తిస్థాయిలో నాణ్యమైన టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలు అందేలా ఇప్పటి నుంచే పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను నిర్దేశించారు. దీంతో పాటు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యాన్ని చేరవేసే  ఇంటింటికి ఇంటర్నెట్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, అనుకున్న లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని టీ-ఫైబర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)