Breaking News

హైదరాబాద్‌ సీపీగా సజ్జనార్‌.. సిరిసిల్ల కలెక్టర్‌గా హరిత

Published on Sat, 09/27/2025 - 08:55

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీ జరిగింది. ఆరుగురు ఐఏఎస్‌, 23 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బత్తుల శివధర్‌రెడ్డిని తెలంగాణ డీజీపీగా ఇప్పటికే నియమించిన సంగతి తెలిసిందే.

ఇక భారీ బదిలీల్లో భాగంగా.. ఆర్టీసీ ఎండీగా ఉన్న వీసీ సజ్జనార్‌ను హైదరాబాద్‌ నగర కమిషనర్‌గా నియమించింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ సందీప్ కుమార్ ఝా గత కొంతకాలంగా వివాదాల్లో చిక్కుకున్నారు. చట్టవిరుద్ధమైన చర్యలు, కోర్టు ఆదేశాల ఉల్లంఘన, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం.. లాంటి అంశాలతో హైకోర్టు సైతం మొన్నీమధ్యే ఆయనపై ఆగ్రం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం ఆయన్ని తప్పించింది. ఆ స్థానంలో హరితను కలెక్టర్‌గా నియమించింది. స్పెషల్ సెక్రటరీగా సందీపకుమార్ ఝాకు బాధ్యతలు అప్పగించింది.

హైదరాబాద్‌ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను.. హోంశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీగా నియమించింది. ఇంటలిజెన్స్‌ డీజీగా విజయ్‌కుమార్‌ను, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి,  విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా శిఖా గోయల్‌, ఫైర్‌ వింగ్‌ డీజీగా విక్రమ్ సింగ్ మాన్, సీఐడీ చీఫ్‌గా వీవీ శ్రీనివాసరావు, పౌరసరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్‌ రవీంద్ర నియమితులయ్యారు.  ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు చారుసిన్హాకు అప్పగించారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సజ్జనార్

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు