Breaking News

ఇది ఇల్లీగల్‌!

Published on Sat, 07/05/2025 - 05:19

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అనధికారిక భవనాలకు ‘ఇది అనుమతి లేని నిర్మాణం’ అంటూ స్పీకింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వడంతో పాటు భవనం ముందు బోర్డులు, హోర్డింగులు ఏర్పాటు చేసేలా ఆదేశాలిస్తామని హైకోర్టు తెలిపింది. దీంతో రెండు ప్రయోజనాలుంటాయని..అది ఒక వేళ బహుళ అంతస్తుల నిర్మాణం, అపార్ట్‌మెంట్‌ అయితే ప్రజలు ఎవ రూ కొనుగోలు చేయరని, వ్యక్తిగత ఇల్లు అయితే పరువు కోసమన్నా అక్రమ నిర్మాణాన్ని నిలిపివేస్తారని స్పష్టం చేసింది. లేకుంటే అనధికారిక నిర్మాణాల ప్రహసనం ఇలానే కొనసాగుతూ ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.

జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాజా కేసులో వివరాలు తెలుసుకుని చెప్పేందుకు సమయం కావాలని కోరడంతో తదుపరి విచారణ ఈ నెల 11కు వాయిదా వేసింది. హైదరాబాద్‌ మహరాజ్‌గంజ్‌ తోటగూడలోని అనధికారిక భవనానికి స్పీకింగ్‌ ఆదేశాలు (నోటీసులు) జారీ చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. ఆ తర్వాత  ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యాపారవేత్త జి.శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వెంటనే కూల్చివేతకు ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  

ఉత్తర్వులకన్నా బోర్డుల ఏర్పాటే ఉత్తమం 
‘అక్రమ నిర్మాణాల ముందు స్పీకింగ్‌ ఉత్తర్వులతో హోర్డింగులు, బోర్టులు ఏర్పాటు చేయాలి. అప్పుడే అనధికారికంగా నిర్మాణాలు చేపట్టే వారికి తెలిసొస్తుంది. చుట్టుపక్కల వాళ్లు అడుగుతారనే భయంతో కూడా నిర్మాణాలు నిలిపివేస్తారు. అలాగే భవనం ముందు బోర్డు ఉంటుంది కనుక మాకు తెలియకుండా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనుగోలు చేశామని ఎవరూ చెప్పరు. న్యాయస్థానాలు ఇచ్చే ఉత్తర్వుల కంటే ఇది సత్ఫలితాలిస్తుంది. ఆ మేరకు మున్సిపల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం. అలాగే అసమర్థులైన ప్రభుత్వ అధికారులపై ఆధారపడటం కంటే ప్రజలు తమ పనులు తామే చేసుకునేలా అలవాటు చేసుకోవడం మంచిది. ఎవరికి వారు చట్టప్రకారం రక్షణ చర్యలు ఎలా తీసుకోవచ్చో నేర్చుకోండి..’అని న్యాయమూర్తి సూచించారు.  

అక్రమార్కుల్లో భయం పోతోంది.. 
‘స్పీకింగ్‌ ఆర్డర్‌ ఇచ్చిన తర్వాత చర్యలు ఎందుకు చేపట్టడం లేదు? ప్రజలంతా కోర్టుకు వచ్చేవరకు ఎందుకు ఆగుతున్నారు? కోర్టు ఆదేశాలిచ్చినా వాటి అమలుకు తాత్సారం చేస్తున్నారు. కూల్చివేత, సీజ్‌ లాంటి చర్యలు వెంటనే ఎందుకు తీసుకోవడం లేదు?.. రానురాను పోలీసు, కోర్టు, అధికారులంటే అక్రమాలు చేసిన వారిలో భయం పోతోంది. సోషల్‌ మీడియా అంటే మాత్రం బెదిరిపోతున్నారు.  

అధికారుల మైండ్‌సెట్‌ మారడం లేదు.. 
జీహెచ్‌ఎంసీ అధికారులకు మంచి సాఫ్ట్‌వేర్, కంప్యూటర్లు, అద్భుత భవనాలన్నీ ప్రభుత్వం ఇచ్చింది. సాంకేతికతలో అంతర్జాతీయ స్థాయి పేరుంది. అయినా పని తీరు మారడం లేదు. అధికారులు మారుతున్నారు తప్ప వారి మైండ్‌సెట్‌ మాత్రం మారడం లేదు. మున్సిపల్‌ అధికారులే కాదు.. వారిని వెనకేసుకొచ్చే స్టాండింగ్‌ కౌన్సిళ్లు కూడా అలానే ఉన్నాయి. కోర్టులు వందల కొద్దీ ఆదేశాలు జారీ చేస్తున్నా.. ఏదో ఒక కారణం చెబుతూ కాలయాపన చేస్తుంటారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడినా.. వారి పరువు పోవద్దని ఆలోచిస్తున్నాం. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే బోర్డు ఏర్పాటుకు ఆదేశాలివ్వాల్సి వస్తుంది..’అని న్యాయమూర్తి హెచ్చరించారు.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?