Breaking News

వేసవిలో తరగతులపై వివరణ ఇవ్వండి

Published on Fri, 05/09/2025 - 04:50

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మిడియెట్‌ కాలేజీలకు వేసవి సెలవులు ఇచ్చినా అందుకు విరుద్ధంగా ప్రైవేటు కాలేజీల్లో జరుగుతున్న తరగతుల నిర్వహణపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేస్తూ ఆలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని జస్టిస్‌ సూరేపల్లి నందా, జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంటర్‌ బోర్డు జారీ చేసిన వార్షిక కేలండర్‌లో ప్రకటించిన విధంగా ప్రైవేట్‌ కళాశాలలు సెలవులు ప్రకటించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బందెల క్రాంతికుమార్‌ తరఫున న్యాయవాది సీఆర్‌ సుకుమార్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఆదివారాలు, ప్రభుత్వ సెలవు రోజులు అని తేడా లేకుండా తరగతులను నిర్వహిస్తున్నారని.. దీనివల్ల విద్యార్థులు ఒత్తిడి, మానసిక రుగ్మతలకు గురై ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా కాలేజీలు వెంటనే తరగతుల నిర్వహణను ఆపేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇలాంటి వాటిపై ఫిర్యాదులు తీసుకోవడానికి ఓ పోర్టల్‌ను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు.

అయితే రాష్ట్రంలోని ఏ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీ కూడా వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించట్లేదని స్పెషల్‌ జీపీ వాదించారు. ట్యూషన్లు, కోచింగ్‌ తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై ఇంటర్‌ బోర్డుకు నియంత్రణ లేదన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలుకు సమయం కావాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఏజీ హాజరై వాదనలు వినిపిస్తారని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో తదుపరి విచారణను వాయిదా వేసింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)