Breaking News

యథావిధిగా గ్రూప్‌–2

Published on Tue, 12/10/2024 - 03:32

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్‌–2 పరీక్షలను వాయిదా వేయలేమ ని హైకోర్టు తేల్చిం చెప్పింది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినందున స్టే ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. యథావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలంగాణ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌కు స్ప ష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఈ నెల 16, 18 తేదీల్లో జరగనున్న రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ ఆర్‌బీ) పరీక్షల దృష్ట్యా 16న జరగనున్న గ్రూప్‌–2 పేపర్‌–3, పేపర్‌–4 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా దంపిల్లపల్లికి చెందిన రావుల జ్యోతితోపాటు మరో 21 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ అంశంపై కమిషన్‌కు నవంబర్‌ 25నే వినతిపత్రం సమ ర్పించినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టుకెక్కారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ పుల్ల కార్తీ క్‌ సోమవారం విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాది స్తూ 15, 16న జరగనున్న గ్రూప్‌–2 పరీక్షలకు దాదాపు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని.. ఇప్పటికే పరీక్షల నిర్వ హణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పారు. స్టే కోరుతున్న వారి కోసం పరీక్షలను వాయిదా వేస్తే లక్షల మంది ఇబ్బందిపడతారని నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ దశలో గ్రూప్‌–2 పరీక్షను నిలిపేయలేమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ ముఖ్య కార్యదర్శి, టీజీపీఎస్సీ, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు నోటీసులు జారీ చేశారు.

గ్రూప్‌–2 హాల్‌టికెట్లు విడుదల 
గ్రూప్‌–2 పరీక్షల కోసం తెలంగాణ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ సోమవారం హాల్‌టికెట్లను విడుదల చేసింది. కమిషన్‌ వెబ్‌సైట్‌లో వాటిని అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కమిషన్‌ కార్యదర్శి ఇ.నవీన్‌ నికోలస్‌ సూచించారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏవైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించేందుకు జిల్లాలవారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ హెల్ప్‌లైన్‌ నంబర్లు 040–22445566/ 23542185/23542187కు కాల్‌ చేసి లేదా  helpdesk@tspsc.gov.in కు ఈ–మెయిల్‌ చేయాలని సూచించారు. తొలిరోజే లక్ష మందికిపైగా అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)