Breaking News

స్పెషల్‌ షోలపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు!

Published on Tue, 01/28/2025 - 10:55

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో స్పెషల్‌ షోల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.  రాత్రి 11గం. తర్వాత వేసే షోలకు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను అనుమతించొద్దని  ఆంక్షలు విధించింది.

సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతిపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా.. థియేటర్లలో పదహారేళ్లలోపు పిల్లల అనుమతిపై హైకోర్టు ఆంక్షలు  విధించింది. రాత్రి 11 నుంచి ఉదయం 11 వరకు చిన్నారులను థియేటర్లలోకి అనుమతించవద్దని పేర్కొంది.

వేళాపాళా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పై ప్రభావం పడుతుందని పిటిషన్ తరపు న్యాయవాది ాదించగా..  ఆ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.  పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక తల్లి మరణించడంతో పాటు ఒక చిన్నారి తీవ్ర గాయాల పాలైన నేపథ్యంలో ఇక చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేసింది. ఈ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే దాకా పిల్లలను స్పెషల్‌ షోలకు అనుమతించొద్దని స్పష్టం చేసింది.   తదుపరి విచారణ వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)