Breaking News

ప్రత్యేక ‘షో’లూ వద్దు

Published on Sat, 01/11/2025 - 01:37

సాక్షి, హైదరాబాద్‌: గేమ్‌ఛేంజర్‌ సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతివ్వడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకపక్క బెనిఫిట్‌ షోలు రద్దు చేశామంటూ, మరోపక్క ప్రత్యేక షోలకు అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించింది. ప్రత్యేక షో కూడా ఒకరకంగా బెనిఫిట్‌ షో లాంటిదే అని వ్యాఖ్యానించింది. వేకువజాము షోలకు అనుమతి, టికెట్‌ ధరల పెంపును పునఃసమీక్షించాలని స్పష్టం చేసింది. భవిష్యత్‌లో కూడా వేకువజాము షోలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని చెబుతూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.

 భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి డబ్బు వసూలు చేయాలనుకోవడం సరికాదని హితవు పలికింది. గేమ్‌ఛేంజర్‌ సినిమాకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెబుతూ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. దిల్‌రాజు నిర్మాతగా శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటించిన గేమ్‌ఛేంజర్‌ సినిమా ప్రత్యేక షోలకు, టికెట్‌ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అర్ధరాత్రి 1 గంట బెనిఫిట్‌ షోకు మాత్రం ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

 జనవరి 10న వేకువజామున 4 గంటల నుంచి 6 షోలకు అనుమతించింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కూరగాయల వ్యాపారి గొర్ల భరత్‌రాజ్‌తోపాటు సతీశ్‌కమాల్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం, టికెట్‌ ధరల పెంపు సినిమాటోగ్రఫీ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. 2021లో జారీ చేసిన జీఓ ప్రకారమే టికెట్ల ధరలు ఉండాలని, కానీ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన మెమో ఆధారంగా అధిక ధరలు వసూలు చేస్తున్నట్టు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

 గేమ్‌ఛేంజర్‌ సినిమా టికెట్‌ ధరల పెంపు ఉత్తర్వులను నిలుపుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. పెంచిన టికెట్‌ ధరలు పూర్తికాలం కొనసాగవని, ఈ నెల 19వ తేదీ వరకే ఉంటాయని హోంశాఖ జీపీ కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకొని.. అర్ధరాత్రి వేళ షోలకు అనుమతిస్తే ఇంటికి వెళ్లే సరికి ఎంత సమయం అవుతుందని జీపీని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే అర్ధరాత్రి తర్వాత బయట తిరగడం కాదని, సమయానికి నిద్రపోవడం కూడా ముఖ్యమే కదా అని మరోసారి చెప్పారు. ప్రేక్షకుల భద్రతనూ దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. తదుపరి విచారణను వాయిదా వేసింది

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)