Breaking News

పదవీ విరమణా? రాజీనామానా?

Published on Sat, 09/20/2025 - 01:45

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వెంకట్రామిరెడ్డి తన అఖిల భారత సర్వీస్‌కు పదవీ విరమణ చేశారా.. లేక రాజీనామా చేశారా.. అన్న వివరాలు లేకుండా పిటిషన్‌ దాఖలు చేస్తే ఎలా అని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకొని మూడు వారాల్లో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. 2021, నవంబర్‌లో జరిగిన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా మాజీ ఐఏఎస్‌ వెంట్రామిరెడ్డి ఎన్నికైన విషయం విదితమే. ఈ ఎన్నిక చట్టవిరుద్ధమంటూ జగిత్యాల జిల్లాకు చెందిన జె.శంకర్‌తోపాటు మరొకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

‘2007 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ వెంకట్రామిరెడ్డి 2021, నవంబర్‌ 15 వరకు అధికారిగా కొనసాగారు. బీఆర్‌ఎస్‌లో చేరే ఉద్దేశంతో స్వచ్ఛంద పదవీవిరమణ నోటీసు సమరి్పంచారు. అయితే ఐఏఎస్‌ అధికారుల స్వచ్ఛంద పదవీ విరమణ నియమాల మేరకు నోటీసు ఇచ్చిన మూడు నెలల్లో డీవోపీటీ ఆమోదం తప్పనిసరి. కానీ, వెంకట్రామిరెడ్డి ఎటువంటి రాజీనామా చేయలేదని, పదవీ విరమణ పత్రాలు తమకు అందలేదని నిర్ధారించింది.

ప్రభుత్వ అధికారిగా కొనసాగుతున్న వ్యక్తి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 6(1) ప్రకారం పోటీకి అనర్హుడు. వెంటనే అతన్ని అనర్హుడిగా ప్రకటిస్తూ.. ఎన్నిక రద్దు చేయాలి’అని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.  వాదనలు విన్న ధర్మాసనం.. పూర్తి వివరాలు తెలుసుకొని అదనపు అఫిడవిట్‌ వేయాలని చెబుతూ విచారణ వాయిదా వేసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)