Breaking News

మీ సొంత ఖర్చులతో షెడ్‌ నిర్మించండి

Published on Wed, 12/18/2024 - 04:23

సాక్షి, హైదరాబాద్‌: చట్టవిరుద్ధంగా, స్టే ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ చిన్నషెడ్‌ కూల్చివేసినందుకు బాధ్యత వహిస్తూ సొంత ఖర్చుతో పున:నిర్మించాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా పంచాయతీ అధికారిని హైకోర్టు ఆదేశించింది. నిలిపివేత ఉత్తర్వులున్నా పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుపేద దంపతులు కట్టుకున్న చిన్నషెడ్‌ను బుల్డోజర్‌తో కూల్చివేసి అధికారులు తమ ఆధిపత్యాన్ని చూపే ప్రయత్నం చేశారని మండిపడింది.

ఇదే తీరులో పలుకుబడి వర్గానికి చెందిన వారి నిర్మాణాలకు కూల్చగలరా అని ప్రశ్నించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంటలో చాలా ఏళ్ల క్రితం ఇల్లు (చిన్నషెడ్‌) నిర్మించుకున్నామని, సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించినా కూల్చివేతకు నోటీసులు జారీ చేశారంటూ కటకం మహేశ్, నాగలక్ష్మి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చిన్న బడ్డీషాపు నిర్వహణకు ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవడంతోపాటు ఆస్తి పన్ను చెల్లిస్తున్న విషయాన్ని కూడా కనీసం పరిగణనలోకి తీసుకోలేదన్నారు.

ఎలాంటి కారణం లేకుండానే నిర్మాణాల తొలగింపునకు పంచాయతీరాజ్‌ అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర స్టే ఉత్తర్వులను కోర్టు మంజూరు చేసింది. మరోవైపు తమ వాదనలను దాఖలు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖను కోర్టు ఆదేశించింది.

కౌంటర్‌ దాఖలు చేయకుండా, మధ్యంతర స్టే ఉత్తర్వులు కొనసాగుతుండగానే మహేష్, నాగలక్ష్మిల ఇంటిని అధికారులు కూల్చివేశారు. పిటిషన్‌పై జస్టిస్‌ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు. సోమవారం విచారణ సందర్భంగా డీపీఓను నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో మంగళవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు సొంత ఖర్చుతో నిర్మాణం చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)