Breaking News

కులం, మతం వద్దు అనుకునే స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చింది

Published on Wed, 11/06/2024 - 00:52

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ప్రతి ఒక్కరికీ మతం వద్దు, కులం వద్దు అనుకునే స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చిందని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. కులాన్ని, మతాన్ని ప్రకటించడానికి, ఆచరించడానికి ప్రజలందరికీ సమాన స్వేచ్ఛ ఉందని అభిప్రాయపడింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ‘కులం లేదు, మతం లేదు’అనే కాలమ్‌ను చేర్చాలంటూ పిటిషనర్లు అక్టోబర్‌ 29న, నవంబర్‌ 1న ఇచ్చిన వినతిపత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే నవంబర్‌ 6 నుంచే సర్వే ప్రారంభమవుతున్నందున ‘కులం లేదు, మతం లేదు’అనే కాలమ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పింది.

ఏ నిర్ణయం తీసుకున్నదీ పిటిషనర్లకు తెలియజేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్‌ 4కు వాయిదా వేసింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ‘కులం లేదు, మతం లేదు’అనే కాలమ్‌ను చేర్చాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ వాహీద్, కృష్ణ చంద్‌ రెండుసార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అయినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అధికారుల తీరు ఉన్నత న్యాయస్థానం గత ఉత్తర్వులకు విరుద్ధమంటూ వారు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ సూరేపల్లి నందా మంగళవారం విచారణ చేపట్టారు. 

వాదనల అనంతరం.. ‘మతం లేదు.. కులం లేదు’ అనుకునేవారి కోసం భారత సెన్సెస్‌ కమిషన్‌ వాటిని ప్రస్తావించకుండా స్వేచ్ఛను మంజూరు చేసిందని న్యాయమూర్తి తెలిపారు. 2010, 2021లో దాఖలైన పిటిషన్లలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. పాఠశాల విద్యా సర్టిఫికెట్లలో కులం, మతం ప్రస్తావన వద్దంటూ పిటిషనర్లు కోరగా, వారికి అనుకూలంగా ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పారు. తదుపరి విచారణలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, జీఏడీ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)