Breaking News

Margadarsi Case: పేపర్లలో వచ్చిన ఫొటోలను పరిగణనలోకి తీసుకోలేం

Published on Fri, 05/12/2023 - 08:44

సాక్షి, హైదరాబాద్‌: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు చేస్తున్న తనిఖీలపై పత్రికల్లో వచ్చిన ఫొటోలను పరిగణనలోకి తీసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి తనిఖీలు జరిపితే.. సంస్థ రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీఐడీని ఆదేశించింది. తనిఖీల పేరిట రోజువారీ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని మార్గదర్శి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ముమ్మినేని సుధీర్‌కుమార్‌ గురువారం విచారణ చేపట్టారు.

ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీపీ ఏబీ లలితా గాయత్రి వాదనలు వినిపించారు. తనిఖీల సమయంలో ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించడంలేదని చెప్పారు. చట్ట ప్రకారమే తనిఖీలు జరిగాయన్నారు. పారదర్శకంగా సాగుతున్న దర్యాప్తును అడ్డుకునేందుకు మార్గదర్శి ఇప్పటికే పలు పిటిషన్లు వేసిందన్నారు. పత్రికలో ఏవో ఫొటోలను ప్రచురించి ఖాతాదారులను అడ్డుకుంటున్నామని చూపించే యత్నం చేస్తోందని తెలిపారు.
చదవండి: అప్పులంటూ అబద్ధాలా?

అలాంటి ఫొటోలను, ప్రచురణలను పరిగణనలోకి తీసుకోవద్దని కోర్టును కోరారు. ఏపీలో నమోదవుతున్న కేసులపై ఈ కోర్టు నుంచి ఉపశమనం పొందాలని భావిస్తోందని తెలిపారు. పరిధి లేని పిటిషన్లను విచారణకు స్వీకరించవద్దని, పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పత్రికల్లోని ఫొటోలను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టంచేశారు. ఈ పిటిషన్‌ కూడా ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లకు కలుపుతూ విచారణను వాయిదా వేశారు.
చదవండి: తీవ్ర తుపానుగా ‘మోచా’  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)