Breaking News

కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా?

Published on Sun, 12/08/2024 - 04:30

సాక్షి, హైదరాబాద్‌: కోర్టు ఆదేశాలను ధిక్కరించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, గండిపేట మండల తహసీల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. గండిపేట మండలం నార్సింగిలోని సర్వే నంబర్‌ 340/4/1లో ఉన్న రెండెకరాల వివాదాస్పద భూమిపై స్టేటస్‌ కో ఆదేశాలున్నా.. అధికారులు ఆ భూమిపై ఓ సంస్థకు పట్టాదారు పాస్‌బుక్‌ జారీచేయటంపై మండిపడింది. ఈ భూమిపై చాలాకాలంగా వివాదం నడుస్తున్నది. సదరు భూమిపై 2014లోనే హైకోర్టు స్టేటస్‌ కో ఆదేశాలిచ్చింది. కానీ, 2023 అక్టోబర్‌లో ధరణి పోర్టల్‌లో ఆ భూమి ఇండ్రస్టియల్‌ ఆయిల్‌ ప్యూరిఫికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందినదిగా గుర్తిస్తూ అధికారులు పట్టాదార్‌ పాస్‌బుక్‌ జారీచేశారు. ఈ చర్యపై పిటిషనర్‌ సంస్థ ఏషియన్‌ ట్యూబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మళ్లీ కోర్టుకు వెళ్లింది.

1998లో చట్టపరంగా సదరు రెండెకరాల భూమిని కొనుగోలు చేశామని ఆ కంపెనీ వాదిస్తున్నది. ఈ అంశంపై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం పిటిషనర్‌కు నోటీసులైనా ఇవ్వకుండా ఇండ్రస్టియల్‌ ఆయిల్‌ ప్యూరిఫికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట పాస్‌బుక్‌ ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. స్టేటస్‌కో ఆదేశాలను పాటించకపోవడం చిన్నం పాండురంగం కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని స్పష్టంచేశారు. ‘కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా? గతంలో స్టేటస్‌ కో ఆదేశాలిచి్చనా మీ ఇష్టం వచి్చన వారిని ధరణి పోర్టల్‌లో చేర్చి పాస్‌బుక్‌ జారీ చేస్తారా? ఈ విషయంలో కలెక్టర్‌తోపాటు ఆర్డీవో, తహసీల్దార్‌ అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఇది ఇలాగే కొనసాగితే న్యాయవ్యవస్థపై కూడా ప్రజలకు నమ్మకం పోతుంది. రెవెన్యూ అధికారుల సహకారం లేకుండా ఈ పనులు జరగవు. ఇండ్రస్టియల్‌ ఆయిల్‌ ప్యూరిఫికేషన్‌ పేరున రెండెకరాల భూమిని ధరణి పోర్టల్లో చేర్చి పాస్‌బుక్‌ జారీ చేయడం చట్టవిరుద్ధం. 2014లో ఈ కోర్టు ఇచి్చన ఆదేశాల మేరకు రెవెన్యూ రికార్డులన్నీ నాలుగు వారాల్లో పిటిషనర్‌ పేరిట మార్చాలి. ఈ అక్రమాల్లో పాలు పంచుకున్న అధికారులపై విచారణ జరిపి క్షమశిక్షణా చర్యలు తీసుకోవాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తున్నాం. భూమిని పొందేందుకు ఇండ్రస్టియల్‌ ఆయిల్‌ ప్యూరిఫికేషన్‌ సంస్థ మోసపూరిత చర్యలకు పాల్పడింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆ సంస్థకు రూ.5 లక్షలు జరిమానా విధిస్తున్నాం. ఆ సొమ్మును నాలుగు వారాల్లో హైకోర్టు లీగల్‌ సరీ్వసెస్‌ కమిటీలో జమ చేసి.. రిసీట్‌ను కోర్టు రిజిస్ట్రీకి సమరి్పంచాలి’ అని  ఆదేశించారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)