Breaking News

ఇక్కడెందుకు పిటిషన్‌ వేశారు?

Published on Tue, 09/24/2024 - 12:20

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 పరీక్షకు సంబంధించి సింగిల్‌ జడ్జి వద్ద పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా, నేరుగా ఇక్కడ పిటిషన్‌ ఎందుకు వేశారని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. రాజ్యాంగ పరమైన ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయని అడిగింది. విచారణను రేపటికి వాయిదా వేస్తూ, ఇక్కడే విచారణ జరపాలా.. లేక సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న పిటిషన్‌లకు అటాచ్‌ చేయాలా అనేది తేలుస్తామని స్పష్టం చేసింది.

 2024, ఫిబ్రవరి 19న జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం టీఎస్‌పీఎస్సీ రూల్‌ ఆఫ్‌ లాను పాటించాలని, ప్రిలిమ్స్, మెయిన్స్‌.. అన్నింటా రిజర్వేషన్లు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నల్లగొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన పోగుల రాంబాబు సహా మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సుజోయ్‌పాల్, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మహిళలు, దివ్యాంగుల కేటగిరీలోనూ సమాంతర రిజర్వేషన్లు పాటించాలని, అధికారులు వరి్టకల్‌గా రోస్టర్‌ పాయింట్లు నిర్ధారిస్తున్నారని, మెయిన్స్‌కు 1ః50 గా ఎంపిక చేశారని, దీనిలో కూడా సమాంతర రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 

ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ లోకస్‌ లేకుండానే రూల్‌ను చాలెంజ్‌ చేస్తూ పిటిషన్‌ వేశారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘చట్టబద్ధమైన రూల్స్‌ లేనప్పుడు సింగిల్‌ జడ్జి వద్ద పిటిషన్‌ దాఖలు చేయాలి కదా, ఇక్కడ ఎందుకు’అని ప్రశ్నించింది. పిటిషనర్‌ న్యాయవాది సమయం కోరడంతో విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)